ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ వాయిదా వేస్తున్నాం: ఈటల
Send us your feedback to audioarticles@vaarta.com
కోవిడ్ మహమ్మారి కారణంగా తలెత్తిన ఇబ్బందులన్నీ ఇప్పుడిప్పుడే కాస్త తొలుగుతున్నాయని ఆనందించే లోపే.. కోవిడ్ కొత్త స్ట్రెయిన్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేసింది. ఈ మహమ్మారి తెలంగాణకు చేరడానికి పెద్ద సమయం ఏమీ పట్టలేదు. అటు కోవిడ్ కొత్త స్ట్రెయిన్ గురించి న్యూస్ బయటకు వచ్చిందో.. లేదో వెంటనే కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయి.. యూకేకు సంబంధించిన విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించింది. అయినా కూడా అప్పటికే యూకే నుంచి వచ్చిన పలువురి ద్వారా ఈ మహమ్మారి ఇండియాలోకి తద్వారా పలు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇచ్చేసింది.
ఈ క్రమంలోనే కోవిడ్ మహమ్మారి కారణంగా హైదరాబాద్‌లో నిర్వహించాల్సిన 81వ అల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌ను వాయిదా వేస్తున్నామని ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనేది సమాచారమిస్తామన్నారు. కరోనా నేపథ్యంలో భారత ప్రభుత్వ నిబంధనలు జనవరి 31 వరకూ ఉన్నాయన్నారు. అయితే మొదటి వేవ్ కేసులు తగ్గుముఖం పట్టాయని మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు.
కాగా.. తెలంగాణ లో సెకండ్ వేవ్ లేదని ఈటల రాజేందర్ వెల్లడించారు. ప్రతి సంవత్సరం జనవరి 1 నుంచి ఫిబ్రవరి 14 వరకూ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ జరిగేదన్నారు. అయితే భారత ప్రభుత్వం నిబంధనల మేరకే ఎగ్జిబిషన్‌ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కేసుల సంఖ్య కోసం వాయిదా వేయడం లేదని స్పష్టం చేశారు. కరోనా వైరస్ మార్పు చెందుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైందన్నారు. అయితే సెకండ్ వేవ్ మాత్రం తెలంగాణలో ఇప్పటి వరకూ లేదన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout