చాలా మంది మీరు సేఫా? అని మెసేజ్‌లు పెడుతున్నారు: జస్విక
Send us your feedback to audioarticles@vaarta.com
టిక్‌టాక్ భార్గవ్ కేసులో తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగు చూస్తునే ఉన్నాయి. భార్గవ్ అందరి ముందు ఒకలా.. ఎవరూ లేనప్పుడు మరోలా ఉంటాడని అతనితో కలిసి పని చేసిన పలువురు అమ్మాయిలు చెబుతున్నారు. అయితే భార్గవ్ కేసులో అసలు అత్యాచారానికి గురైన 13 ఏళ్ల బాలిక స్థానంలో ఎందరివో పేర్లు బయటకు వస్తున్నాయి. దీంతో చేసేదేమీలేక సదరు అమ్మాయిలు ఓ వీడియో సందేశం ద్వారా తాము కాదని చెప్పుకోవల్సిన దుస్థితి ఏర్పడింది. తాజాగా ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ తండ్రితో కలిసి ఓ వీడియోను షూట్ చేసి యూ ట్యూబ్‌లో పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. జస్విక, మేఘన అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ తండ్రిలో కలిసి ఓ వీడియో సందేశం ఇచ్చారు. ఆ వీడియోలో జస్వక మాట్లాడింది. భార్గవ్ కేసులో ఫిమేల్గా మొదట తన అక్కను, తరువాత తనను అజ్యూమ్ చేసుకున్నారని.. దాని వల్ల చాలా కామెంట్స్ వస్తున్నాయని జస్విక వాపోయింది. క్లారిటీ ఇవ్వడానికి వీడియో చేస్తున్నామని చెప్పింది. భార్గవ్ కేసులో మైనర్ ఏజ్ 13 ఏళ్లని.. తన అక్కకు 20 ఏళ్లు, తనకు 16 ఏళ్లని జస్విక తెలిపింది. మీరు సేఫా? అని చాలా మంది మెసేజ్‌లు పెడుతున్నారన్నారు. మాకేమీ ప్రాబ్లమ్ లేదు. మా వీడియోస్ అన్నీ మా డాడీయే చూసుకుంటారని జస్విక వెల్లడించింది.
అనంతరం జస్విక తండ్రి మాట్లాడుతూ... మా పిల్లల వీడియోస్ అన్నీ స్క్రిప్ట్ నుంచి ఎడిటింగ్ వరకూ అన్నీ తానే చేస్తానని వెల్లడించారు. రెండు నెలల నుంచి భార్గవ్ కోసం వర్క్ చేస్తున్నానన్నారు. ఇన్ని రోజులు మా ఛానల్లో వీడియో పెట్టడం కుదరడం లేదు. మా పిల్లలిద్దరికీ నటనంటే ఇష్టం. నేను 20 ఏళ్లుగా సినిమాల్లో వర్క్ చేస్తున్నాను. నా వీడియోపై బ్యాడ్ కామెంట్స్ ఏమీ పెట్టకండి. నేను అన్నీ స్క్రీన్ షాట్ తీస్తున్నా. అవన్నీ సైబర్‌క్రైమ్‌కు వెళ్తాయి. బెదిరించడంలేదు. దయచేసి అర్థం చేసుకోండన్నారు. మా అక్క పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారు. ఇక మా అక్క పేరుతో ఉన్న అకౌంట్స్‌ని డిలీట్ చేశాం. ఆమె చాలా డిస్టర్బ్ అయ్యింది. చాలా సెన్సిటివ్ మా అక్క. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. నేను చాలా టీవీ షోస్ చేస్తున్నాం అందుకే వీడియోస్ చేయడం కుదరడం లేదు. నన్ను ఎప్పటిలాగే ఆదరిస్తారని అనుకుంటున్నా’’ అని జస్విక తెలిపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout