ఓ సోషల్ ఎక్స్‌పీరియెన్స్‌ను కోల్పోతున్నాం: మోహనకృష్ణ ఇంద్రగంటి
- IndiaGlitz, [Tuesday,September 01 2020]
గ్రహణం సినిమాతో దర్శకుడిగా మోహనకృష్ణ ఇంద్రగంటి తన కెరీర్‌ను ప్రారంభించారు. 16 ఏళ్ల జర్నీలో తెరకెక్కించిన సినిమాలు మాత్రం చాలా తక్కువే. కేవలం పది సినిమాలే అయినప్పటికీ ఏ సినిమాకు ఆ సినిమా ప్రత్యేకతను చాటుకుంది. తాజాగా ఆయన తెరకెక్కించిన చిత్రం ‘వి’. ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మోహనకృష్ణ ఇంద్రగంటి పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు.
‘‘ఓటీటీలకు నేను వ్యతిరేకం కాదు.. దీన్ని ఒక మాధ్యమంగానే చూడాలే తప్ప.. సినిమాతో పోల్చకూడదు. ఓటీటీలో సినిమాను విడుదల చేయడం వల్ల ఫస్ట్ డే మనం థియేటర్‌కు వెళ్లి సినిమా చూడటం, ఫస్ట్ డే కలెక్షన్స్ వంటి వాటన్నింటినీ మిస్ అవుతున్నాం. ఓ సోషల్ ఎక్స్‌పీరియెన్స్‌ను కోల్పోతున్నాం. ‘వి’ సినిమాను ఇప్పటికే ఐదు నెలలుగా హోల్డ్ చేశాం. ప్రేక్షకుల్లో కూడా సినిమా విడుదలపై ఆసక్తి నెలకొంది. ఇంకా థియేటర్స్ ఓపెన్ చేసే విషయంలో క్లారిటీ లేదు. ఇంకా ప్రేక్షకులను ఎగ్జయిట్మెంట్‌తో హోల్డ్ చేయడం మంచిది కాదని ఆలోచించి నిర్ణయించుకున్నాం. ఓ రకంగా థియేటర్స్ కంటే ఓటీటీ వల్ల సినిమా 200 దేశాల్లో విడుదలవుతుంది. అందరికీ సినిమా చేరువ అవుతుంది. మొదటివారంలో సినిమా చూసేవాళ్లు మొదటి రోజునే సినిమా చూసే అవకాశం కలిగింది’’ అని మోహనకృష్ణ ఇంద్రగంటి పేర్కొన్నారు.
‘వి’ చిత్రంలో నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు, అదితిరావు హైదరి, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్, హర్షిత్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్రం ‘వి’. ఇప్పటి వరకు థియేటర్స్ కోసమే ఎదురు చూసిన ఈ చిత్రం.. పరిస్థితుల్లో మార్పులు లేకపోవడంతో.. ఓటీటీ ద్వారా విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 5న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు, అదితిరావు హైదరి, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించారు.