యుద్ధం చేస్తున్నాం.. ఇప్పుడు వద్దు : ఎన్టీఆర్

  • IndiaGlitz, [Wednesday,May 19 2021]

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే వేడుకల్ని ప్రతి ఏటా తెలుగు రాష్ట్రాల అభిమానులు ఘనంగా సెలెబ్రేట్ చేసుకుంటారు. కేక్ కటింగ్స్, అన్న దాన కార్యక్రమాలు, పూజలు నిర్వహిస్తుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి వేరు. దేశం మొత్తం కరోనా వైరస్ తో పోరాటం చేస్తోంది.

మే 20న జూనియర్ ఎన్టీఆర్ 38వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎన్టీఆర్ అభిమానులందరికీ ఓ అప్పీల్ చేశాడు. కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా తన బర్త్ డేని అభిమానులు ఎవరూ సెలెబ్రేట్ చేయవద్దని కోరాడు. ఈ మేరకు ఎన్టీఆర్ అధికారిక ప్రకటన చేశాడు.

'నా అభిమానులందరికీ కృతజ్ఞతలు. గత కొన్ని రోజులుగా మీరు పంపుతున్న సందేశాలు, వీడియోలు చూస్తున్నాను. మీ ఆశీస్సులు నాకెంతో ఊరట కలిగించాయి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను ?

ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను. కోవిడ్ ని జయిస్తానని ఆశిస్తున్నాను. ప్రతి ఏటా మీరు ఆ పుట్టిన రోజున చేసే కార్యక్రమాలు ఆశీర్వాదంగా భావిస్తాను. కానీ ఈ ఏడాది మాత్రం మీరంతా లాక్ డౌన్ నియమాలు పాటిస్తూ ఇంటివద్దనే ఉండాలని కోరుకుంటున్నాను. ఇది వేడుకలు చేసుకునే సమయం కాదు. ప్రతి ఒక్కరం కోవిడ్ తో యుద్ధం చేస్తున్నాం.

ఇలాంటి సమయంలో మనకోసం శ్రమిస్తున్న డాక్టర్లు, నర్సులు, ఫ్రంట్ లైన్ వారియర్స్ కి సంఘీభావం తెలపాలి. కరోనా బారీన పడి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలబడాలి. చేతనైన సాయం చేయాలి' అని ఎన్టీఆర్ తన అభిమానులని కోరారు. కరోనాని దేశం జయించిన రోజున అందరం కలసి సెలెబ్రేట్ చేసుకుందాం అని ఎన్టీఆర్ తన ప్రకటనలో తెలిపారు.

ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీం నుంచి ఏదైనా సర్ ప్రైజ్ ఉంటుందేమోనని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.

More News

తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం అందజేసిన నిధి

కరోనా సెకండ్ వేవ్ కారణంగా పెద్ద ఎత్తున ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే.

రష్మికకు విజయ్ దేవరకొండ ప్రపోజ్ చేశాడా ? వీడియో వైరల్

సెలెబ్రిటీల మధ్య ఎఫైర్ స్టోరీలు అల్లేయడానికి నెటిజన్లకు చిన్న అవకాశం దొరికినా చాలు. అది నిజామా, అబద్దమా, మ్యాటర్ ఏంటి..

డైరెక్టర్ చేతులు పట్టుకుని అడిగాడు.. పవన్ కి ముందే తెలుసు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ పూలబాటేమీ కాదు. మెగాస్టార్ సోదరుడిగా సులువుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ దొరికింది.

నెటిజన్లపై రేణు దేశాయ్ ఫైర్

ప్రముఖ నటి రేణూ దేశాయ్‌ నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది పెట్టే సరదా మెస్సేజ్‌లు కారణంగా నిజమైన బాధితులకు సాయం

కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత టీకా కోసం 9 నెలలు ఆగాలట..

దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరత తీవ్ర స్థాయిలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల సలహా కమిటీ కీలక సూచన చేసింది.