'ఓ మై గాడ్' ఆడియోకి వస్తున్న రెస్పాన్స్ కి హ్యాపీ - మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్
Send us your feedback to audioarticles@vaarta.com
తనీష్, మేఘశ్రీ, పావని హీరో హీరోయిన్లుగా.. శ్రీ వెంకటేశ్వర విజువల్స్ పతాకంపై వేణు ముక్కపాటి నిర్మించిన చిత్రం 'ఓ మై గాడ్'. వి.శ్రీవాత్సవ్ దర్శకుడు. ఈ చిత్రం ఆడియో ఇటివలే విడుదలై మంచి సక్సెస్ అయ్యింది. ఆడియో కి వచ్చిన రెస్పాన్స్ తో మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ చాలా హ్యాపీ గా వున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''నేను గతం లో చేసిన మొగుడ్స్ పెళ్లాంస్ నుండి..ఇప్పటి వరకు 15 సినిమాలకు మ్యూజిక్ అందించ్చాను. ఈ మధ్య కాలంలో నాకు బాగా సంతృప్తినిచ్చిన చిత్రం 'ఓ మై గాడ్'. ఈ పాటలు విన్నవారందరూ అభినందిస్తుంటే చాలా హ్యాపీ గా వుంది. ఈ సినిమాకు మ్యూజిక్ అందించే అవకాసం ఇచ్చిన దర్శకులు వి.శ్రీవాత్సవ్ గారికి, నిర్మాత వేణు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ పాటలు ఇంత బాగా రావడానికి మా లిరిక్ రైటర్ ఉత్తరావెల్లి రామారావు అందించిన సహకారం మరవలేనిది. అలాగే మా సింగర్ రమ్య కోయిల్ ఫస్ట్ టైం సింగర్ గా చాలా బాగా పాడింది. ఈ సినిమాలోని పాటలను ప్రేక్షకులకు ఇంతగా ఆదరించినందుకు..కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సినిమా కూడా మంచి సక్సెస్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను...'' అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com