Komatireddy Venkatreddy:యాదాద్రి కాదు యాదగిరిగుట్టగా మారుస్తున్నాం.. త్వరలోనే జీవో: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

  • IndiaGlitz, [Saturday,March 02 2024]

యాదాద్రి పేరును మళ్లీ యాదగిరిగుట్టగా మారుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ మేరకు త్వరలోనే జీవో జారీ చేస్తామని పేర్కొన్నారు. ఆయన తాజాగా మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ కేటీఆర్ ఇప్పటికీ తండ్రి కేసీఆర్‌ చాటు కొడుకే. నేను ఉద్యమాలు చేసి వచ్చాను. మేం జీరో బిల్ ఇచ్చినట్టు.. కేటీఆర్‌కి జీరో నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ లేని కేటీఆర్ గురించి మాట్లాడడం వృథా. ఫ్లోర్ లీడర్ ఇవ్వకపోతే హరీష్ కూడా బీజేపీలోకి పోతాడు. కాళేశ్వరం కట్టిన చీఫ్ డిజైనర్ కేసీఆర్ మేడిగడ్డ ఎందుకు పోలేదు? అని ప్రశ్నించారు.

కాళేశ్వరం పనికిరాదని ఎన్‌డీఎస్‌ఏ రిపోర్ట్ ఇచ్చింది. ప్రజలే కేసీఆర్‌ను నామరూపాలు లేకుండా చేశారు. ఎంపీ అభ్యర్థులపై అంతర్గత సర్వే జరుగుతోంది. భువనగిరి నుండి పోటీ చేయమని రాహుల్ గాంధీని కోరాను. భువనగిరి, ఖమ్మం, నల్గొండలో.. దక్షిణాదిలో టాప్ మెజార్టీ వస్తుంది. మోదీ కంటే రాహుల్ గాంధీ ఎక్కువ మెజారిటీతో గెలుస్తారు అని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

కాగా యాదాద్రి పేరును తిరిగి యాదగిరిగుట్టగా మారుస్తామని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య రెండు రోజుల క్రితం ప్రకటించారు. పూర్వం నుంచి ఉన్న పేరును మార్చడం సరికాదని అభిప్రాయపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే ఆలయాన్ని సందర్శిస్తారని.. ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి కూడా ఇదే మాట చెప్పడంతో యాదాద్రి పేరు మారడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో యాదగిరిగుట్ట అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తిరుమల స్థాయిలో ఈ ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో పునర్నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చినజీయర్ స్వామి సూచనలతో యాదాద్రిగా పేరు మార్చారు. అయితే ప్రజలు మాత్రం యాదగిరిగుట్టగానే పిలుస్తున్నారు. దీంతో యాదాద్రి పేరు మార్చాలనే వాదన తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో యాదగిరిగుట్టగా మారుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో విడుదల చేసేందుకు సిద్ధమైంది.

More News

Mukesh Ambani: కుమారుడు మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న ముఖేశ్ అంబానీ

బిజినెస్ టైకూన్, అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రివెడ్డింగ్ గ్రాండ్‌గా జరుగుతున్న సంగతి తెలిసిందే. గుజరాత్‌లోని జామ్ నగర్‌లో న భూతో న భవిష్యతి

YSRCP Manifesto: ఆ వర్గాలే లక్ష్యంగా.. సిద్ధం సభలో వైసీపీ మేనిఫెస్టో ప్రకటన..

వచ్చే ఎన్నికలకు అధికార వైసీపీ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే సిద్ధం సభలతో క్యాడర్‌కు దిశానిర్దేశం చేసిన ఆ పార్టీ అధినేత సీఎం జగన్ తాజాగా మేనిఫెస్టోపై కసరత్తును పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

Vyooham Review: అభిమానులకు మాత్రం పండగే.. ఆర్జీవీ 'వ్యూహం' ఎలా ఉందంటే..?

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కిన చిత్రం ‘వ్యూహం’. ప్రస్తుత ఏపీ సీఎం జగన్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఎన్నో వివాదాలను

Pawan Kalyan:తాగేందుకు నీళ్లు అడిగితే చంపేస్తారా?.. పవన్ కల్యాణ్‌ తీవ్ర ఆగ్రహం..

తాగేందుకు నీళ్లు అడిగితే చంపేస్తారా? అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Lokesh:లోకేష్‌ను ఓడించడమే లక్ష్యం.. మంగళగిరి వైసీపీ ఇంఛార్జ్‌ మళ్లీ మార్పు..

అసెంబ్లీ, పార్లమెంట్ నియోజవర్గాల సమన్వయకర్తల జాబితాలను వైసీపీ ప్రకటిస్తూనే ఉంది. ఇప్పటివరకు 8 జాబితాలను విడుదల చేయడగా..