చిరు 150 సినిమాలు.. రూ. 300కే థియేటర్‌లో చూసేయండి!
Send us your feedback to audioarticles@vaarta.com
టైటిల్ చూడగానే అవునా.. అదెలా సాధ్యం.. సీడీల్లో అయితే చూడొచ్చన్నా అది ఓ లెక్కా..! థియేటర్లలో 150 సినిమాలు అది కూడా.. కేవలం రూ.300కా వినడానికి.. చదవాడానికి కాస్త ఆశ్చర్యంగానే ఉంది కదూ.. అవును మీరు వింటున్నది అక్షరాలా నిజమే. అసలు 150 సినిమాల సంగతేంటి..? ఇంత చీప్‌గా ఏ థియేటర్‌లో ప్రదర్శిస్తున్నారో..? ఇప్పుడు చూద్దాం.
వాస్తవానికి ఇది మెగాభిమానులకు, సినీ ప్రియులకు బంపరాఫరే అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇదిగో.. ఈ సినిమాలు ప్రదర్శించేది మరెక్కడో కాదండోయ్.. మెగాభిమానులు ఓ రేంజ్‌లో ఉండే వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రొద్దటూరులోని రామేశ్వరం థియేటర్‌లో. వండర్ వరల్డ్, లింకా బుక్ ఆఫ్ రికార్డులలో చోటు కోసం ఈ థియేటర్ యాజమాన్యం ఈ భగీరథ ప్రయత్నం చేస్తోంది. అన్నిరోజులకు.. అన్ని సినిమాలకు కలిపి ఒకే టికెట్ అనగా.. కేవలం రూ. 300 రూపాయలు పెట్టడం విశేషమని చెప్పుకోవచ్చు. అంతేకాదు.. బ్లడ్ గ్రూప్ కూడా ఉచితంగా చెక్ చేస్తామని చెబుతున్నారు. రోజుకొకటి చొప్పున మొత్తం 150 రోజులు అనగా ఐదు నెలల పాటు థియేటర్‌లో ప్రదర్శిస్తారన్న మాట. ఇదిగో.. ఈ ప్రయత్నాన్ని బట్టి చూస్తే.. ఈ థియేటర్ యజమానులు చిరు అంటే ఏ రేంజ్‌లో అభిమానముందో అర్థం చేసుకోవచ్చు.
కాగా.. రాయలసీమలో ప్రత్యేకించి మరీ.. కడప జిల్లాలో మెగా ఫ్యామిలీకి అభిమానులు భారీగానే ఉన్నారు. చిరు సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు రెండ్రోజుల ముందు నుంచే హడావుడి మామూలుగా ఉండదు. సినిమా రిలీజ్ రోజైతే ఇక కడప టౌన్‌లో మెయిన్ సెంటర్ అయిన సెవెన్ రోడ్స్‌లో ఇసుకేస్తే రాలనంత మంది అభిమానులు ఉంటారు. భారీగా ర్యాలీలు, బైక్ ర్యాలీలు గట్రా గట్టిగానే ఫ్యాన్స్ చేపడుతుంటారు. ఇవన్నీ అటుంచితే రక్త దానాలు, అన్నదానాలు కూడా పెద్ద ఎత్తునే చేస్తుంటారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout