అన్నగారి ప్రభుత్వం లేకపోవడంతో అవార్డ్ ఇవ్వలేదు..

  • IndiaGlitz, [Saturday,June 04 2016]

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు న‌టించిన సంచ‌ల‌న చిత్రం అసెంబ్లీ రౌడీ. ఈ చిత్రాన్ని బి.గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో మోహ‌న్ బాబు నిర్మించారు. నేటికి అసెంబ్లీ రౌడీ చిత్రం స‌రిగ్గా 25 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం 25 వారాల పాటు విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డి చ‌రిత్ర సృష్టించింది. అసెంబ్లీ రౌడీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా...
మోహ‌న్ బాబు మాట్లాడుతూ... టైటిల్ విషయానికి వస్తే... అసెంబ్లీ రౌడీ ఏమిటి ఈ టైటిల్.. సినిమాను బ్యాన్ చేయాలి అంటూ... అప్పుడు అసెంబ్లీలో పెద్ద దుమారమే చెల‌రేగింది. సినిమా పోస్టర్స్, కటౌట్స్ ను తగలబెట్టారు. అయితే అన్నగారు నందమూరి తారక రామారావుగారు అండగా నిలబడ్డారు. అప్పటి స్పీకర్ ధర్మారావుగారు సినిమా చూసి సినిమా చాలా బావుందని అన్నారు. అయితే ఆత‌ర్వాత అన్న గారి ప్ర‌భుత్వం అధికారంలో లేక‌పోవ‌డం వ‌ల‌న ఈ చిత్రానికి అవార్డ్ ఇవ్వ‌లేదు. అయినా సినిమా అనేది వ్యాపారం. సినిమా తీస్తే డ‌బ్బు, మంచి పేరు రావాలి కానీ..అవార్డ్ ఎవ‌రి కావాలి అంటూ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌చేసారు.

More News

'అఆ'కి కత్తెర పడింది

నితిన్, సమంత జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చినబాబు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం ‘అఆ’. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది.

రైట్ రైట్ సినిమాతో నాలో ఆ న‌మ్మ‌కం క‌లిగింది - బాహుబ‌లి ప్ర‌భాక‌ర్

సుమంత్ అశ్విన్, పూజా జ‌వేరి, కాళికేయ ప్ర‌భాక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో మ‌ను తెర‌కెక్కించిన చిత్రం రైట్ రైట్. ఈ చిత్రాన్నివంశీకృష్ణ రెడ్డి నిర్మించారు. 

ఆయూస్ సంస్థకు జెంటిల్ మన్ టీం & అభిషేక్ పిక్చర్స్ సపోర్ట్

హైదరాబాద్ లో స్కూల్ ఫీజు లు కట్టుకోలేని పిల్లల కోసం ఆయూస్ సంస్థ చేయూత నిచ్చేందుకు ముందుకు వచ్చింది.

నా ప్రయత్నానికి గెలుపు అదే - విశాల్

విశాల్,శ్రీదివ్య జంటగా ముత్తయ్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం రాయుడు.ఈ చిత్రాన్ని విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై విశాల్ నిర్మించారు.

అభినేత్రి టీజర్ & ట్రైలర్ రిలీజ్..

ప్రభుదేవా,తమన్నా,సోనూసూద్ ప్రధాన పాత్రల్లో ఎ.ఎల్.విజయ్ తెరకెక్కించిన చిత్రం అభినేత్రి.