నాని అరాచకాలు జగన్‌కు కనిపించలేదా.. ఇలాచేస్తే అనాథే!?

  • IndiaGlitz, [Saturday,July 27 2019]

వైసీపీ నేతలు.. ఆ పార్టీ అధినేతపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలు సమాజంలో అభద్రతా భావం సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలపై ఇప్పటివరకు 285 దాడులు, 7 హత్యలు జరిగాయని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో సిమెంట్ బస్తా ధర కన్నా ఇసుక బస్తా ధర అధికంగా ఉందని.. ఇసుక కొరత కారణంగా, ఎక్కువ రేట్లకు విక్రయిస్తున్నారని బాబు చెప్పుకొచ్చారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఇసుక పాలసీని ఇంకా ఎందుకు అమలు చేయలేదని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు.

ఇలానే చేస్తే రాష్ట్రం అనాథే..!

ఈ ప్రభుత్వానికి రెండు రోజుల సమయం ఇస్తున్నాము. బాధ్యులపై చర్యలు తీసుకోకుంటే గోడ కట్టిన ప్రదేశాన్ని పరిశీలిస్తాం. ఇన్ని జరుగుతున్నా పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదు?. ఈ ఘటనలు సీఎం, హోం మంత్రికి కనిపించడం లేదా?. వైసీపీ తమ రౌడీయిజాన్ని పులివెందులలో చూపించుకోవాలని, మమ్మల్ని భయపెట్టాలని చూస్తే ఊరుకోము. వైసీపీ నేతల తీరు ఇలానే ఉంటే భవిష్యత్‌లో రాష్ట్రం అనాథగా మారిపోతుంది. ప్రజలు తిరగబడితే వైసీపీ నేతలు పారిపోక తప్పదు. నిత్యం అత్యాచారాలు, రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వాటిని అరికట్టకుండా టీడీపీ కార్యకర్తల జోలికి వస్తున్నారని విమర్శించారు అని చంద్రబాబు హెచ్చరించారు.

నాని అరాచకాలు కనిపించట్లేదా!

పల్నాడులోని గ్రామాల్లో ఉన్న టీడీపీ సానుభూతిపరులను ఖాళీ చేయిస్తున్నారు. ఈ విషయమై ఫిర్యాదు చేస్తే ఎస్పీ నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పేర్ని నాని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మహిళ ఆత్మహత్య చేసుకుందని, నాని అరాచకాలు సీఎం జగన్‌కు కనిపించలేదా?. టీడీపీ నేతలకు ఏదైనా జరిగితే సీఎందే బాధ్యత. టీడీపీ నేతలపై జరుగుతున్న దాడుల గురించి, కరవు ప్రాంతాల గురించి శాసనసభలో చర్చిద్దామంటే వినలేదుఅని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాకు మైక్ ఇవ్వట్లేదు..!

ఏపీ శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్ష నేతకు మైక్ ఇవ్వకుండా ఏకపక్షంగా స్పీకర్ తమ్మినేని వ్యవహరిస్తున్నారు. స్పీకర్ స్థానానికి ఉన్న గౌరవం పోయేలా ఆయన వ్యవహరిస్తున్నారు. ఒకవేళ తమ సభ్యులకు పొరపాటున మైకు ఇచ్చినా, అధికార పార్టీ నుంచి సూచనలు వచ్చిన వెంటనే కట్ చేస్తారు. మాకు మాట్లాడే అవకాశం లేకపోవడంతోనే ఇలా ప్రతిరోజూ మీడియా ముందుకు వస్తున్నాము. సభలో మాట్లాడాల్సిన అంశాలను ఇక్కడ వివరించాల్సి వస్తోంది. ఇంకా, రెండు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఈ రెండు రోజులు సభలోనే అధికారపక్షాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత, అధికార పార్టీ ఏం చేస్తుందనే విషయాలను ప్రజల్లోకి వెళ్లి వివరిస్తాం అని చంద్రబాబు తేల్చిచెప్పారు.

More News

కోమటిరెడ్డి ఆలోచించు.. కేసీఆర్ ఆధారాలున్నాయ్!!

మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి చాలా రోజుల తర్వాత మీడియా ముందుకొచ్చారు.

వైఎస్ జగన్‌ 'ట్రెండ్‌ సెట్టర్‌'గా మిగిలిపోతారు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్రెండ్‌ సెట్టర్‌గా చరిత్రలో నిలిచిపోతారని వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర బాగు కోసం అనేక అభివృద్ధి

జనసేన పటిష్టానికి పవన్ చర్యలు.. నాగబాబుకు కీలక బాధ్యతలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఊహించని రీతిలో ఓటమిని చవిచూశాక.. రానున్న ఎన్నికల్లో అయినా రాణించి పార్టీ సత్తా ఏంటో చూపించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నడుం బిగించారు.

గూగుల్‌కే ఊహించని షాకిచ్చిన ‘లేడీ’..!!

గూగుల్ అంటే తెలియని వారుండరు.. దీన్ని ప్రతిరోజూ వాడకుండా ఉండలేరు కూడా. నిద్రలేచింది మొదలుకుని నిద్రపోయే వరకు ఈ గూగుల్‌తోనే అంతా పని. ప్రతి ఒక్కరు ఎదో ఒక సందర్భంలో గూగుల్ సెర్చ్ ఇంజన్ మీద ఆధారపడే వారే.

కాల్ చేసి ఓటీపీ అడుగుతారు.. చెప్పారో అంతే సంగతులు!!

ఇప్పటి వరకూ ఫోన్ నంబర్‌కు పలుమార్లు కాల్స్ రావడం.. ఓటీపీ చెప్పడం ఇలా మోసపోయామని పోలీసులు ఫిర్యాదు చేయడం.. ఇలాంటి వార్తలు టీవీల్లో్, పేపర్లో పెద్ద ఎత్తున వినేవుంటాం.