వింగ్ కమాండర్ అభినందన్ పై ప్రయోగం జరిగిందా..!?
Send us your feedback to audioarticles@vaarta.com
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ఇండియాలో అడుగుపెట్టగానే ఆయన కొన్ని వైద్య పరీక్షలు జరగనున్నాయి. ఈ సందర్భంగా వాఘా వద్ద ఆంక్షలు విధించడం జరిగింది. పాక్ ఇచ్చిన వైద్య నివేదికలతో పోల్చి మరో నివేదిక తయారు చేయనున్నారు. ఏమైనా నిఘా వస్తువులు, అనుమానాస్పద వస్తువులున్నాయా..? ఆయనపై ఏదైనా ప్రయోగం జరిగిందా..? ఆయన ఏదైనా ప్రభావంలో ఉన్నారా..? అని నిపుణుల సమక్షంలో నిశితంగా తనిఖీలు, పరీక్షలు నిర్వహించనున్నారు. అభినందన్ దుస్తులు, వస్తువులను సేకరించి పరీక్షలు చేయనున్నారు. కాగా ఇప్పటికే వాఘాకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించిన వైద్య నిపుణుల బృందం చేరుకుంది. వైద్య పరీక్షల అనంతరం అభినందన్‌తో అధికారులు చర్చలు జరపనున్నారు.
ఈ సందర్భంగా డీ బ్రీఫింగ్ ప్రక్రియలో భాగంగా అభినందన్‌పై ప్రశ్నల వర్షం కురిపించనున్నట్లు తెలుస్తోంది. పాక్‌లో పట్టుబడిన నాటి నుంచి అప్పగింత వరకు అసలేం జరిగింది..? పాక్ ఆర్మీ ఏమేం అడిగింది..? మీరు ఏమని సమాధానమిచ్చారు..? ఇలాంటి ప్రశ్నలకు అభినందన్‌ను అడుగుతారని సమాచారం. అభినందన్ మొత్తం ఎపిసోడ్‌పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రభుత్వానికి ఓ నివేదిక ఇవ్వనుంది. మరోవైపు అటారి-వాఘా మార్గం గుండా అభినందన్‌ను రెడ్‌క్రాస్ భారత్‌కు తీసుకురానుంది.
ఈ సందర్భంగా కొడుకును చూసేందుకు తల్లిదండ్రులు, భార్యాపిల్లలు వాఘా సరిహద్దుకు చేరుకున్నారు. కాగా మరికాసేపట్లో అభినందన్‌కు సరిహద్దుకు చేరుకోనున్నారు. అప్పగింత వ్యవహారాలన్నీ భారత్ రాయబారి అయిన గౌరవ్ అహ్లువాలియా పూర్తి చేశారు. అభినందన్ డాక్యుమెంట్లు మొత్తం గ్రూప్ కెప్టెన్ అయిన జె.టి. క్రెయిన్ సమర్పించారు. దగ్గరుండి అభినందన్‌ను గ్రూప్ కెప్టెన్ తీసుకురానున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments