బన్నికి యాక్సిడెంట్ అయ్యిందా...?

  • IndiaGlitz, [Tuesday,September 08 2015]

బ‌న్ని... బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ ముఖ్య‌పాత్ర‌లో శ్రీకాంత్ కూడా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం రామెజీ ఫిలింసిటీలో బ‌న్ని, శ్రీకాంత్ మ‌రి కొంత మంది ఫైట‌ర్స్ పై యాక్ష‌న్ సీన్స్ షూట్ చేస్తున్నారు.

అయితే ఎవ‌రు ప్రారంభించారో కానీ....బ‌న్నికి షూటింగ్ లో చేయి విరిగింద‌ని పుకారు షికారు చేస్తుంది. ఈ విష‌యం ఆ నోట‌...ఈ నోట వెళ్లి ఆఖ‌రికి బ‌న్ని చెవిలో ప‌డింది. వెంట‌నే ఈ పుకారుకి ఫుల్ స్టాప్ పెట్టాల‌ని డైసైడ్ అయ్యాడు. త‌న భార్య స్నేహ గ‌తంలో జ‌రిగిన యాక్సిడెంట్ వ‌ల‌న కాళ్ల‌లో ప్లేట్స్ వేసార‌ని...వాటిని తీయించుకునేందుకు హాస్ప‌ట‌ల్ కి వెళ్లింద‌ని...నాకు ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేద‌న్నాడు. నేను ప్ర‌స్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ లో ఉన్నాన‌ని..పుకార్ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌న్నాడు బ‌న్ని.