రజనీకాంత్ కి వార్నింగ్...
Send us your feedback to audioarticles@vaarta.com
దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం 'కబాలి' సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. 'కొచ్చడయాన్', 'లింగ' సినిమాల ఫెయిలూర్స్ తర్వాత రజనీకాంత్ అచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటూ సాగిపోతున్నారు. త్వరలోనే రజనీకాంత్ 'టిప్పుసుల్తాన్' అనే సినిమా చేస్తాడనే వార్తలు వినపడ్డాయి.
అయితే ఈ సినిమాలో రజనీకాంత్ నటించకూడదని తమిళ సంఘాలు రజనీకాంత్‌కి హెచ్చరికలుపంపాయట. ఎందుకంటే టిప్పుసుల్తాన్ కర్ణాటకను పాలించిన గొప్ప రాజు, బ్రిటిష్ వారికి ఎదురొడ్డి పోరాడాడు. అయితే ఆయన తమిళ వ్యతిరేకట. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. అప్పట్లో ఆయన తమిళులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నాడనే అపవాదు కూడా ఉండటంతో ఈ చిత్రంలో రజనీకాంత్ నటించకూడదని కొందరంటున్నారు. మరి రజనీకాంత్ చేస్తాడంటారా? చూద్దాం ఏమౌవుతుందో...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com