దళిత ద్రోహి చంద్రబాబు కుల అహంకారాన్ని అణివేస్తామని హెచ్చరిక

  • IndiaGlitz, [Tuesday,January 16 2024]

పేరుకేమో మాది దళితులను గౌరవించే పార్టీ.. బీసీలకు రాజకీయంగా చేయిందించే పార్టీ అని ప్రగాల్బాలు పలుకుతూ ఉంటారు. కానీ వాస్తవంగా చూస్తే మాత్రం అందుకు విరుద్ధంగా ఆ పార్టీ అధినేత వ్యవహరిస్తూ ఉంటారు. ఆ పార్టీ ఏదో.. ఆ అధినేత ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాష్ట్ర ప్రజలను ఎవరినీ అడిగినా ఇట్టే చెప్పేస్తుంటారు. ఆ పార్టీనే తెలుగుదేశం. ఆయన పేరే చంద్రబాబు అని. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా బడుగు, బలహీన వర్గాలను ఆయన ఛీదరించుకుంటూనే ఉంటారు. రాజకీయంగా వాడుకుని అణగదొక్కుతూంటారని చెబుతూ ఉంటారు.

ఎస్సీలుగా పుట్టాలనుకుంటారా..?

ఇప్పటికే అనేక సందర్భాల్లో దళితులను అవమానించిన ఘటనలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటారా..? అని ఘోరంగా అవమానించారు. దళితులను అంత చులకన చేసి మాట్లాడిన చంద్రబాబుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అందుకే గత ఎన్నికల్లో బాబుకు బాగా బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోపెట్టారు. అయినా కానీ ఆ పార్టీ నేతల తీరులో మార్పు రాలేదు. కొన్నేళ్ల క్రితం సీనియర్ నేత వర్ల రామయ్య ఈ నా..కులకు ఎందుకు ప్రభుత్వ ఉద్యోగాలు అంటూ ఘోరంగా అవమానించారు.

అగ్ర కులాలకే ప్రాధాన్యత..

ఈ ఘటనలు ఇంకా కళ్ల ముందు మెదిలాడుతుండగానే తాజాగా చిత్తూరులో ఓ దళిత మాజీ మంత్రి పట్ల చంద్రబాబు వ్యవహరించిన తీరు మరోసారి విమర్శలకు తావిచ్చింది. చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఇంచార్జ్ పులివర్తి నాని ఇంటికి చంద్రబాబు వెళ్లారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అయితే ఈ ప్రెస్‌మీట్‌లో తన పక్కన దళితులను కూర్చుపెట్టుకోవడానికి నామోషీగా ఫీలయ్యారు. తనకు అటు ఇటు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, గాలి భానుప్రకాష్, పులివర్తి నాని, కూర్చుకున్నారు.

మాజీ దళిత మంత్రికి ఘోర అవమానం..

కానీ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి, మంత్రిగా పనిచేసిన దళిత నేత పరసరత్నంని మాత్రం దూరంగా నిల్చుని పెట్టారు. ఇదేనా ఓ దళిత మాజీ మంత్రికి చంద్రబాబు ఇచ్చే గౌరవమని దళిత నాయకులు నిలదీస్తున్నారు. తొలి నుంచి దళితులను హీనంగా చూస్తున్న చంద్రబాబును.. వచ్చే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించి తీరుతామని హెచ్చరిస్తున్నారు. అలాగే దళితులకు అండగా నిలబడే సీఎం జగన్‌ను గెలిపించి తీరుతామని చెబుతున్నారు.