దీపికలా కనపడాలని ..
Send us your feedback to audioarticles@vaarta.com
రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్లో పాగా వేయాలని శత విధాల ప్రయత్నం చేస్తోంది. ఆమె నటించిన అయ్యారి సినిమా సక్సెస్ కాలేదు. ఇప్పుడు బాలీవుడ్ మరో అవకాశం వచ్చింది. అదే 'దే దే ప్యార్ దే'. అజయ్ దేవగణ్, టుబులతో పాటు రకుల్ నటించింది. 50 ఏళ్ల వ్యక్తిని ప్రేమించే కుర్రభామగా రకుల్ కనపడనుంది. అకివ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా మే 17న విడుదల కానుంది.
రీసెంట్గా విడుదలైన వడి షరబన్ సాంగ్‌లో రకుల్ చాలా గ్లామర్‌గా ఉందని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ సాంగ్‌లో రకుల్‌కి అంత క్రేజ్ రావడానికి కారణం దర్శకుడు అకివ్ అలీయే కారణమట. ఎందుకంటే.. ఈ సినిమా కోసం కాక్టెయిల్లో దీపికా పదుకొనె లుక్‌లో కనపడాలని రకుల్‌కు ముందుగానే సూచించాడట.
అందుకోసం రకుల్ ఉన్న బరువును కాస్త మరింతగా తగ్గించుకుంది. స్లిమ్‌గా కనపడటానికి 10 కిలోల బరువు తగ్గింది. రకుల్ పడ్డ కష్టానికి ఇప్పుడు రిజల్ట్ ప్రశంసల రూపంలో కనపడుతుంది. ఈ సినిమా హిట్ అయితే రకుల్‌కు మరిన్ని బాలీవుడ్ ఆఫర్స్ ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments