మ‌ల‌యాళంలో కూడా చేయాల‌నుంద‌ట‌...

  • IndiaGlitz, [Thursday,August 04 2016]

ఆగ‌స్ట్ 5న శ్రీర‌స్తుశుభ‌మ‌స్తు చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించనున్నాడు మెగా క్యాంప్ హీరో, అల్లు వారి వార‌సుడు అల్లు శిరీష్. గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌లో ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వంలో రానున్న ఈ సినిమా ఫ‌లితంపై చాలా క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నాడు. కాగా మ‌ల‌యాళం నుండి ఓ స్టార్ డైరెక్ట‌ర్ సినిమా చేయ‌మ‌ని అల్లు శిరీష్‌ను అడిగాడ‌ట‌.

చేయాలా వ‌ద్దా అని ఆలోచిస్తున్నాన‌ని, అయితే ప్ర‌స్తుతం హీరోలు ద్విభాషా చిత్రాల‌ను చేస్తుండ‌టంతో తాను కూడా ద్విభాషా చిత్రాలు చేయాల‌నుకుంటున్నాన‌ని శిరీష్ తెలిపారు. బ‌న్నికి అల్రెడి మ‌ల‌యాళంలో తిరుగులేని క్రేజ్ ఉంది. మ‌రి శిరీష్ కూడా అక్క‌డ పాగా వేస్తాడో లేదో చూడాలి.