బన్నీ, విజయ్ ఏం తింటారో తెలుసుకోవాలి: హృతిక్ రోషన్
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే హై ఎనర్జీ. ఆయన డాన్సులకు ప్రత్యేకమైన అభిమానులుంటారు. ఎందరో ఆయన డాన్స్ సూపర్బ్ అంటూ అభినందించారు. ఇప్పుడు ఈ లిస్టులో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కూడా చేరారు. బాలీవుడ్ హ్యండ్‌సమ్ గ్రీక్‌గా పేరున్న హృతిక్ డాన్సులు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు...ఇరగదీస్తుంటాడు. ఓ కార్యక్రమంలో భాగంగా హృతిక్ చెన్నై చేరుకున్నారు. ఆయన మాట్లాడుతూ నేను బిజీగా ఉండటం వల్ల ఇటీవల విడుదలైన దక్షిణాది సినిమాలను చూడలేకపోయాను. కానీ ఇక్కడ సినిమాల్లో ఉపయోగించే టెక్నాలజీకి నేను పెద్ద అభిమానిని. ఇక్కడి నుండి ఆ విషయాన్ని నేర్చుకోవాలి. సాధారణంగా నాకు కథ నచ్చితే 30 సెకన్ల కంటే ఎక్కువగా ఆలోచించను. నా మనసు, ఆత్మ ఏం చెబుతుందో దాన్ని బట్టే సినిమాలు చేస్తాను. నేను ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ అలాగే చేశాను.
డాన్స్‌కు ఎంతో సాధన అవసరం. ఆస్వాదిస్తూ డాన్స్ చేయాలి. భావాల్ని పలికించాలి. మనం డాన్స్‌ను ఎంజాయ్ చేస్తే ఆ భావాలు ముఖంలో కనపడతాయి. అప్పుడు మూమెంట్స్ కాస్త తప్పైనా పెద్ద తేడా ఉండదు’’ అని చెప్పారు. ఆ సందర్భంలో అల్లు అర్జున్ డాన్స్ గురించి అడగ్గా ‘‘ఎనర్జిటిక్, స్ఫూర్తిదాయకం, స్ట్రాంగ్’’ అని బదులిచ్చారు. కోలీవుడ్ హీరో విజయ్ డాన్స్ గురించి అడగ్గా ‘‘నాకు తెలిసి వీళ్లు రహస్యంగా ఏదో తింటున్నారు. ఎందుకంటే రోజంతా ఉత్సాహంతోనే ఉంటారు. వీళ్లు డాన్స్ చేసే ముందు ఏం తింటారో తెలుసుకోవాలి’’ అని బదులిచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com