Jayalalitha: శరత్‌బాబుతో పిల్లలు కనాలనుకున్నా.. జయలలిత హాట్ కామెంట్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో హీరోయిన్గా, నటిగా ఓ వెలుగు వెలిగారు జయలలిత. ప్రస్తుతం అడపాదడపా మాత్రమే సినిమాలు చూస్తున్నారు. ఇటీవల సీరియల్స్‌లోనూ నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన సినీ, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దివంగత నటుడు శరత్ బాబు, తాను పెళ్లి చేసుకోవాలనుకున్నామని.. బిడ్డను కూడా కనేందుకు ప్లాన్ చేసినట్లు తెలిపారు.
"అమ్మానాన్న చనిపోయాక నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. నాకు రమాప్రభ చాలా క్లోజ్ ఫ్రెండ్. రమా, శరత్ బాబులను అక్కా బావా అంటూ పిలిచేదాన్ని.. నేను శరత్ బాబు కలిసి పలు తీర్థయాత్రలకు వెళ్లాం. ఈ క్రమంలోనే మా మధ్య ప్రేమ బంధం ఏర్పడింది. అది చాలా కాలం పాటు కొనసాగింది. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. పిల్లల్ని కూడా కనాలనుకున్నాం. ఇదే విషయాన్ని సినిమా ఇండస్ట్రీలోని మా స్నేహితులకు చెప్పాం. అయితే వారు శరత్ బాబుకు వద్దని చెప్పారట. దీంతో మా పెళ్లి ఆగిపోయింది. శరత్ బాబుకు పిల్లలు అంటే కాస్త భయం ఉండేది. పిల్లలు పుట్టాకా ఆస్తి కోసం పిల్లల్ని ఎవరైనా ఏమైనా చేస్తారని భావించి వద్దనేవారు. ఆయన చివరి రోజుల్లో ప్రతిరోజూ ఆస్పత్రికి వెళ్లేదాన్ని. అయితే ఆయనకు సేవ చేసుకునే భాగ్యం కూడా నాకు దక్కలేదు" అని ఆమె చెప్పుకొచ్చారు.
అలాగే మొదటి పెళ్లి, బ్రేకప్ తర్వాత మళ్లీ ప్రేమ వైపు, కొత్త బంధం వైపు అడుగులు వేయలేదా అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ "ఎందుకో ప్రేమ వైపు మనసు మళ్లలేదు. ఎవరి తోడు అవసరం లేదు అనిపించింది. చాలా మంది రెండో పెళ్లి చేసుకుంటాం, ఉంచుకుంటాం అంటూ వచ్చారు. కానీ, భగవంతుడు నన్ను అటువైపు వెళ్లనివ్వలేదు. అన్నపూర్ణమ్మ వీళ్లంతా కనీసం ఒక బిడ్డనైనా దత్తత తీసుకోండి అన్నారు. అక్క పిల్లలు ఉన్నారు కదా. చాలు అనుకున్నాను" అని వెల్లడించారు.
అంతేకాకుండా కెరీర్ తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న సందర్భాలను చాలా బోల్డ్‌గా చెప్పారు. "ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో చాలామంది మగాళ్లకు లొంగిపోయాను. అయితే ప్రేమ, పెళ్లి గురించి ఎవరూ మాట్లాడేవారు కాదు. అందంగా ఉండటంతోపాటు వ్యాంప్ పాత్రలు చేయడంతో చాలామంది వచ్చేవారు. కొన్నిసార్లు తప్పించుకునే దానిని.. మరికొన్నిసార్లు లొంగిపోయాను. ఇంకొన్నిసార్లు నాకు నచ్చే వెళ్లేదాన్ని. పరిశ్రమలో తలుపులు కొట్టడం, అడగడం లాంటివి ఉంటాయి. ఒకతను రాత్రి తలుపు కొట్టి తీయకపోతే ఉరి వేసుకుంటా అని బెదిరించాడు. అయితే నేను ఎప్పుడూ అటువంటివాటికి భయపడలేదు. తప్పించుకోవడానికి ప్రయత్నించేదాన్ని. అలా తప్పించుకుంటే ఓ దర్శకుడు సినిమాలో నా క్యారెక్టర్ తీసేశాడు" అని పేర్కొన్నారు.
ఇక దివంగత నటుడు గమ్మడి గారి గుంచి చెబుతూ "నా కోసం సులా అనే ఒక వైన్ బాటిల్ రోజు తెప్పించేవారు 800 రూపాయలు పెట్టి. ఇది నీకే. ఇది జయమ్మకే. వేరే ఎవరు ముట్టుకోవద్దు అని చెప్పేసి. ఒక నాలుగైదు సంవత్సరాలు కలిసి జర్నీ చేశాం. ఇప్పుడు అటు నుంచి వెళ్తే.. ఆ ఇల్లు చూస్తే మాత్రం నాకు ఏడుపు వస్తుంది. ఆయన పోయిన తర్వాత అక్కడ నిల్చుని ఉంటే పిల్లలందరిని పలకరిస్తూ నా భుజం తట్టి నాగేశ్వరరావు గారు ఓదార్చారు"అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇలా తన జీవితంలో ఎదురైన ప్రతి అనుభవాన్ని ఆమె నిర్భయంగా చెప్పుకొచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments