లివ్ ఇన్ కోసం పర్మిషన్ కావాలట...
- IndiaGlitz, [Thursday,February 28 2019]
సూపర్‌స్టార్ మహేష్ సరసన వన్ నేనొక్కడినే చిత్రంలో నటించిన బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్.. ఇప్పుడు బాలీవుడ్ సినిమాలతోనే బిజీగా మారిపోయింది. ఇప్పుడు కార్తీక్ ఆర్యన్‌తో కలిసి లుకా ఛుపీ సినిమా చేసింది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ ఆధారంగా ఈ సినిమా కథాంశం ఉంటుంది.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో మాట్లాడుతూ తాను లివ్ ఇన్ రిలేషన్లో ఉండటానికి తల్లిదండ్రులు వ్యతిరేకిస్తారేమోనని అనుకునేదాన్ని, అయితే తల్లి మాత్రం తాను లివ్ ఇన్ రిలేషన్ షిప్లో ఉండటానికి అంగీకరించిందట. కానీ కృతి తండ్రి మాత్రం అందుకు ససేమిరా ఒప్పుకోలేదట. అయితే లుకా ఛుపీ సినిమా రిలీజ్ తర్వాత లివ్ ఇన్ రిలేషన్‌కు తండ్రి ఒప్పుకుంటాడనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చింది మహేష్ హీరోయిన్ కృతిసనన్.