రియలిస్టిక్ గా ఉండే..రిలేషన్ షిప్ డ్రామా నన్ను వదలి నీవు పోలేవులే - హీరోయిన్ వామికా

  • IndiaGlitz, [Tuesday,March 08 2016]

బాల‌కృష్ణ కోలా, వామికా జంట‌గా బీప్‌టోన్ స్టూడియోస్, శ్రీ కామాక్షి మ‌ల్టీమీడియా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన సినిమా న‌న్ను వ‌దిలి నీవు పోలేవులే. ఈ సినిమాకు శ్రీరాఘ‌వ క‌థ‌, స్క్రీన్‌ప్లేను అందించారు. గీతాంజ‌లి శ్రీరాఘ‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని కోలా భాస్క‌ర్‌, కంచ‌ర్ల పార్థ‌సార‌థి నిర్మించారు. ఈ నెల 18న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా హీరోయిన్ వామికా ఇంట‌ర్ వ్యూ మీకోసం...
న‌న్ను వ‌దిలి నీవు పోలేవులే...త‌మిళ వెర్ష‌న్ రిలీజ్ అయ్యింది క‌దా...అక్క‌డ రెస్పాన్స్ ఎలా ఉంది..?
త‌మిళ్ లో ఈ సినిమా మంచి విజ‌యాన్ని సాధించింది. ముఖ్యంగా ఈ సినిమాలో నా ప‌ర్ ఫార్మెన్స్ కి మంచి రెస్పాన్స్ ల‌భించడం నాకు చాలా సంతోషంగా ఉంది.చెన్నైలో ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో ని ఫ్యామిలీ మెంబ‌ర్స్ తో క‌ల‌సి చూసాను. అనుకోకుండా అక్క‌డకి ఈ సినిమా టీమ్ మెంబ‌ర్స్ కూడా ఫ్యామిలీతో వ‌చ్చారు. నాకు ఫ‌స్ట్ సినిమా అయిన‌ప్ప‌టికీ ఆడియోన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమా అంతా అయిపోయిన త‌ర్వాత అంద‌రూ లేచి నిల‌బ‌డి క్లాప్స్ తో అభినందించ‌డం ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను.
ఈ సినిమాలో అవ‌కాశం ఎలా వ‌చ్చింది..?
భ‌లే మంచి రోజు సినిమా కంటే ముందు ఈ సినిమాలో అవ‌కాశం వ‌చ్చింది. అడిష‌న్స్ కి ర‌మ్మంటే నో చెప్పాను. ఆత‌ర్వాత మూడు నాలుగు నెల‌ల త‌ర్వాత మ‌ళ్లీ ఫోన్ చేసి అడిష‌న్స్ కి ర‌మ్మ‌న్నారు. స‌రే..అని వెళ్ళాను. అనుకోకుండా సెలెక్ట్ అయిపోయాను. రేపటి నుంచే షూటింగ్ స్టార్ట్ అన్నారు. ఆవిధంగా ఈ సినిమాలో అవ‌కాశం వ‌చ్చింది.
డైరెక్ట‌ర్ శ్రీరాఘ‌వ క‌థ - స్ర్కీన్ ప్లే అందించిన సినిమా...ముందు నో చెప్ప‌డానికి కార‌ణం ఏమిటి..?
డైరెక్ట‌ర్ శ్రీరాఘ‌వ గురించి నాకు తెలియ‌దు. అలాగే సౌత్ సినిమాలు చేయాలంటే నాకు లాంగ్వేజ్ రాదు. అందుక‌ని ముందు నో చెప్పాను. ఆత‌ర్వాత శ్రీరాఘ‌వ గురించి తెలుసుకోవ‌డం..అలాగే ఇందులో నా క్యారెక్ట‌ర్ కూడా బాగా న‌చ్చ‌డంతో ఓకే చెప్పాను.
న‌న్ను వ‌ద‌లి నీవు పోలేవులే...మీ క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుంది..?
నా క్యారెక్ట‌ర్ పేరు మ‌నోజ‌. మోడ్రన్ గ‌ర్ల్ గా క‌నిపిస్తాను. రియ‌లిస్టిక్ గా ఉండే నా క్యారెక్ట‌ర్ లో చాలా షేడ్స్ ఉన్నాయి. నిజ‌మైన ప్రేమ‌ను న‌మ్ముతుంది. ఫైన‌ల్ గా నిజ‌మైన ప్రేమ‌ను ఎలా తెలుసుకుంది అనేది నా క్యారెక్ట‌ర్.
ఈ సినిమా కథ ఏమిటి..?
రిలేష‌న్ షిప్ డ్రామా ఇది. ప్ర‌తి ఒక్క‌ర్ని ఆక‌ట్టుకునేలా ఈ సినిమా ఉంటుంది. ఈ క‌థ‌ని లేడీ డైరెక్ట‌ర్ గీతాంజ‌లి గారు డైరెక్ట్ చేయ‌డం సినిమాకి ప్ల‌స్ పాయింట్. ఖ‌చ్చితంగా ఓ మంచి చిత్రంగా నిలుస్తుంది.
బాలీవుడ్ లో ఈత‌ర‌హా చిత్రాల‌కి, ఈ సినిమాకి ఉన్న తేడా ఏమిటి..?
ఈ సినిమా అంతా చాలా రియ‌లిస్టిక్ గా ఉంటుంది. ఎక్క‌డా సినిమాలాగా అనిపించ‌దు. మన ప‌క్క‌న జ‌రుగుతున్న‌ట్టుగా అనిపిస్తుంటుంది.
భ‌లే మంచి రోజు లో మీ క్యారెక్ట‌ర్ కి, ఇందులో క్యారెక్ట‌ర్ కి ఉన్నవ్య‌త్యాసం ఏమిటి..?
భ‌లే మంచి రోజులో నాది ఓ క్యారెక్ట‌ర్ మాత్ర‌మే. ఇందులో అయితే సినిమా అంతా నా చుట్టూ తిరుగుతుంటుంది. అలాగే ప‌ర్ ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్ట‌ర్. సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రికి గుర్తుండేలా నా క్యారెక్ట‌ర్ ఉంటుంది.
భ‌లే మంచి రోజులో సినిమా అంతా ఒకే డ్రెస్ లో ఉంటారు క‌దా...మరి ఇందులో...?
ఈ సినిమాలో కొంచెం సేపు చీర‌లో క‌నిపిస్తాను. కొంచెం సేపు జీన్స్ లో క‌నిపిస్తాను. ర‌క‌ర‌కాల డ్రెసెస్ లో కనిపిస్తాను. ఈ సినిమాలో కాన్ స‌న్ ట్రేష‌న్ డ్రెస్ మీద ఉండ‌దు..అంతా డైలాగ్స్ మీదే ఉంటుంది.
మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి..?
మా తాత‌య్య సింగ‌ర్. నాన్న రైట‌ర్. అమ్మ స్కూలు ర‌న్ చేస్తుంది. అన్న‌య్య ధియేట‌ర్ ఆర్టిస్ట్.
సినిమా రంగంలోకి ప్ర‌వేశించ‌డానికి కార‌ణం ఏమిటి..?
నాన్న ఎప్పుడూ చెబుతుండే వారు...నువ్వు ఏ ప‌ని చేస్తే హ్యాఫీగా ఉంటావో...అదే చేయ‌మ‌ని. నాకు న‌ట‌న అంటే ఇష్టం అందుక‌నే సినిమా రంగంలో ప్ర‌వేశించాను.
తెలుగు, త‌మిళ్ సినిమాల్లో న‌టించారు క‌దా...రెండింటికి ఉన్నతేడా ఏమిటి..?
తెలుగు, త‌మిళ్ లో ఈ రెండు ఇండ‌స్ట్రీల్లో మంచి చిత్రాలు వ‌స్తున్నాయి. నాకు పెద్ద‌గా తేడాగా క‌నిపించ‌లేదు.
ఉమెన్స్ డే సంద‌ర్భంగా మ‌హిళ‌ల‌కు మీరిచ్చే సందేశం ఏమిటి..?
ఎప్పుడూ న‌వ్వుతూ ఉండాలి...స్ట్రాంగ్ గా ఉండాలి.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?
మ‌ల‌యాళంలో ఓ సినిమా చేస్తున్నాను. తెలుగులో క‌థ‌లు వింటున్నాను. ఇంకా ఏది ఫైన‌ల్ కాలేదు.