Waltair Veerayya:'వాల్తేరు వీరయ్య' సెకండ్ సింగిల్ 'నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి' డిసెంబర్ 19న విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల క్రేజీ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'వాల్తేరు వీరయ్య' అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే వాల్తేరు వీరయ్య ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇటీవల విడుదలైన రవితేజ టీజర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. బాస్ పార్టీ సాంగ్ 25 మిలియన్ల వ్యూస్ ని క్రాస్ చేసి రీల్ మేకర్స్ కు ఫేవరెట్ గా మారింది.
ఇప్పుడు సెకండ్ సింగిల్ ‘నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి’ ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ నెల 19న సెకండ్ సింగిల్ ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ చిరంజీవి, శృతి హాసన్‌ల కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. శ్రుతి హాసన్, చిరంజీవికి జోడిగా చూడటం ఇదే మొదటిసారి. శ్రుతి హాసన్ అందంగా ఉంది. బాస్, శృతి హాసన్ కెమిస్ట్రీ అద్భుతంగా కనిపిస్తుంది.
ఈ పాట కోసం దేవి శ్రీ ప్రసాద్ మరో మ్యూజికల్ ట్రీట్ ని స్కోర్ చేశారు. చిరంజీవి లీక్ చేసిన వీడియో ద్వారా ఇప్పటికే చిన్న గ్లింప్స్ అందరినీ సర్ ప్రైజ్ చేసింది. ఈ పాటలో చిరంజీవి, శ్రీదేవిల ఐకానిక్ పెయిర్ ప్రస్తావన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పోస్టర్‌లో మంచుతో కప్పబడిన లొకేషన్ కన్నుల పండువగా కనిపిస్తోంది.
సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. చివరి పాటను ప్రస్తుతం చిరంజీవి, శృతి హాసన్‌లపై యూరప్‌లో చిత్రీకరిస్తున్నారు. 'వాల్తేరు వీరయ్య' జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
నటీనటులు: చిరంజీవి, రవితేజ, శృతి హాసన్ తదితరులు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments