ఆ..సినిమా రిజ‌ల్ట్ కోసం వెయిట్ చేస్తున్నచ‌ర‌ణ్‌

  • IndiaGlitz, [Wednesday,January 06 2016]

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌..బ్రూస్ లీ త‌ర్వాత త‌ని ఓరువ‌న్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కించ‌నున్నారు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇప్ప‌టికే ప్రారంభం కావాలి కానీ...కొన్ని కార‌ణాల వ‌ల‌న‌ ప్రారంభం కాలేదు. అయితే రామ్ చ‌ర‌ణ్ త‌ని ఓరువ‌న్ రీమేక్ తో పాటు మ‌రో సినిమా కూడా ఓకేసారి స్టార్ట్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడ‌ట‌.

ఇటీవ‌ల మేర్ల‌పాక గాంథీ చ‌ర‌ణ్ కి క‌థ చెప్పాడ‌ట‌. గాంధీ చెప్పిన క‌థ చ‌ర‌ణ్ కి న‌చ్చింద‌ట‌. అయితే మేర్ల‌పాక గాంథీ తెర‌కెక్కించిన ఎక్స్ ప్రెస్ రాజా సంక్రాంతి కానుక‌గా ఈనెల 14న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా రిజ‌ల్ట్ చూసి మేర్ల‌పాక గాంధీకి ఛాన్స్ ఇవ్వాలా..? వ‌ద్దా...? అనేది నిర్ణ‌యిస్తాడ‌ట‌. అందుక‌నే చ‌ర‌ణ్ ఎక్స్ ప్రెస్ రాజా రిజ‌ల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడ‌ట‌. అన్ని కుదిరితే చ‌ర‌ణ్‌, గాంధీ క‌ల‌యిక‌లో రూపొందే సినిమాని యు.వి క్రియేష‌న్స్ సంస్థే నిర్మిస్తుంద‌ట‌. మ‌రి...ఎక్స్ ప్రెస్ రాజా రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో..? గాంథీకి చ‌ర‌ణ్ ఛాన్స్ ఇస్తాడో..ఇవ్వ‌డో తెలియాలంటే ఈనెల 14 వ‌ర‌కు ఆగాల్సిందే.

More News

డిక్టేట‌ర్ సెన్సార్ రిపోర్ట్..

నంద‌మూరి న‌ట సింహం బాల‌య్య హీరోగా శ్రీవాస్ తెర‌కెక్కించిన చిత్రం డిక్టేట‌ర్. ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన డిక్టేట‌ర్ సంక్రాంతి కానుక‌గా ఈనెల 14న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.

'చిత్రం భళారే విచిత్రం' మూవీ రివ్యూ

ప్రస్తుతం హర్రర్ కామెడి చిత్రాలకు మంచి ట్రెండ్ కొనసాగుతుంది. ఆ ట్రెండ్ ను ఫాలో అవుతూ వచ్చిన సినిమాలు మంచి ఆదరణ కూడా పొందాయి. దాంతో ప్రయోగం దర్శకుడు భాను ప్రకాస్ బలుసు చేసిన హర్రర్ కామెడి చిత్రమే చిత్రం భళారే విచిత్రం.

హేబాను గిల్లేశారు...

కుమారి 21ఎఫ్ తో సక్సెస్ కొట్టిన హీరోయిన్ హేబాపటేల్ ఇప్పుడు ఎన్టీఆర్ సరసన అవకాశం దక్కించుకుంది.

ప్లాప్ సినిమా టైటిల్‌తో ర‌వితేజ‌..

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా గ‌తేడాది విడుద‌లైన చిత్రం కిక్‌2. ఈసినిమాలో ర‌వితేజ డ్యూయెల్ రోల్ పోషించాడు.

డిక్టేట‌ర్ ఆడియో స‌క్సెస్ మీట్ వాయిదా..

నంద‌మూరి న‌ట సింహం బాల‌క్రిష్ణ న‌టించిన తాజా చిత్రం డిక్టేట‌ర్. శ్రీవాస్ తెర‌కెక్కించిన డిక్టేట‌ర్ మూవీ సంక్రాంతికి సంద‌డి చేయ‌డానికి వ‌స్తుంది.