చిరు ఫోన్ కోసం వెయిటింగ్.. నాన్నకు చెప్పా!!

  • IndiaGlitz, [Saturday,January 11 2020]

‘భరత్‌ అనే నేను’, ‘మహర్షి’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ తర్వాత సూపర్‌స్టార్‌ మహేశ్‌ హీరోగా దిల్‌ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రం ఎల్లుండి అనగా.. జనవరి 11న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అవుతుంది. ప్రమోషన్‌లో భాగంగా సరిలేరు ఇంటర్వ్యూలో గురించి పలు ఆసక్తికర విషయాలను మహేశ్ వెల్లడించారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి.. నాన్న సూపర్‌స్టార్ కృష్ణ గురించి మహేశ్ బాబు ఆసక్తికర విషయాలను చెప్పారు.

ప్రశ్న : ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చిరంజీవిగారు మిమ్మల్ని అప్రిషియేట్‌ చేయడం ఎలా అన్పించింది?

మహేశ్ : చిరంజీవిగారు నన్నెప్పటి నుండో సపోర్ట్‌ చేస్తూ వస్తున్నారు. ‘ఒక్కడు’ సినిమా ఆయనకు విపరీతంగా నచ్చి నాతో ఫోన్‌లో మాట్లాడారు. ఆ తర్వాత ‘అర్జున్‌’ సినిమా కోసం మధురమీనాక్షి టెంపుల్‌ సెట్‌ వేశాం. ఆయన స్వయంగా ఆ సెట్‌కి వచ్చి చాలాసేపు గడిపారు. మీలాంటి వాళ్లు ఇలాంటి సినిమాలు చేస్తే ఇండస్ట్రీ చాలా బాగుంటుంది అన్నారు. ఆయన నాకెప్పటికీ ఇన్‌స్పిరేషనే. అలాగే ‘పోకిరి’ సినిమా చూసి జగన్‌గారి ఆఫీస్‌ నుండి నాకు కాల్‌ చేసి రమ్మని, దాదాపు మూడు గంటల సేపు ఆ సినిమా గురించి మాట్లాడారు. అప్పటి నుండి ఏ సినిమా రిలీజై హిట్టయినా ఆయన్నుండే ఫస్ట్‌ ఫోన్‌ కాల్‌ వస్తుంది. అందుకే ఫంక్షన్‌లో జనవరి 11న ఫస్ట్‌ ఫోన్‌ కాల్‌ ఆయన నుండే రావాలని కోరుకుంటున్నానని చెప్పాను. చిరంజీవిగారిని ఆహ్వానించడం అనేది నా ఐడియానే. ఇలా ఫంక్షన్‌ అనుకుంటున్నాం. మీరు రావాలి అనగానే, వెంటనే తప్పకుండా వస్తాను అని మెసేజ్‌ పెట్టారు.

ప్రశ్న : అదే వేదికపై నాన్నగారికి దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు ఇవ్వాలని కోరారు కదా?

మహేశ్ : నాన్నగారిని కలిసినప్పుడు ఈ టాపిక్ వచ్చింది. నాన్న గారు.. చిరంజీవి చాలా బాగా మాట్లాడారు థాంక్స్‌ చెప్పానని చెప్పు అన్నారు. నిజంగా నాన్నగారి ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీ’ అని మహేశ్ బాబు చెప్పుకొచ్చారు.

More News

రక్తం ఉడిపోతోంది.. 25 కుర్రాడిలానే.. : చంద్రబాబు

వైసీపీ పాలన చూస్తుంటే రక్తం ఉడికిపోతోందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

‘కడప రాజధానిగా గ్రేటర్ రాయలసీమ కావాలి’

నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తరలించొద్దని రైతులు, రైతు కూలీలు, టీడీపీ నేతలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ధర్నాలు, ర్యాలీలు చేపడుతున్న సంగతి తెలిసిందే.

నాడు జగన్‌కు.. నేడు బాబుకు.. సేమ్‌ టూ సేమ్!

ప్రస్తుతం నెట్టింట్లో రెండు ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. అందులో ఒకటి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిది కాగా..

'అల వైకుంఠపురములో' ఒక మంచి అనుభూతినిస్తుంది - త్రివిక్రమ్

'అల వైకుంఠపురములో' థియేటర్స్ నుంచి జనం ఒక కంప్లీట్ ఫీలింగ్తో, ఆనందంతో బయటకు వస్తా రని చెప్పారు త్రివిక్రమ్.

త్రివిక్రమ్ సినిమాల్లో ‘స్త్రీలు, ఇళ్లు’ పైనే ఫోకస్ ఎందుకు!?

‘అల వైకుంఠపురములో’ థియేటర్స్ నుంచి జనం ఒక కంప్లీట్ ఫీలింగ్‌తో, ఆనందంతో బయటకు వస్తారని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు.