మేడే సందర్భంగా వి. వి. వినాయ‌క్ చేతుల మీదుగా 'శంభో శంక‌ర‌' తొలి లిరిక‌ల్ వీడియో సాంగ్

  • IndiaGlitz, [Saturday,April 28 2018]

శంక‌ర్ హీరోగా శ్రీధ‌ర్ ఎన్. ద‌ర్శ‌క‌త్వంలో  ఆర్.ఆర్ . పిక్చ‌ర్స్ సంస్థ   ఎస్. కె. పిక్చ‌ర్స్ సమ‌ర్ప‌ణ‌లో నిర్మిస్తోన్న చిత్రం  'శంభో శంక‌ర‌'. ఇప్ప‌టికే రిలీజైన పోస్ల‌ర్ల‌కు మంచి రెస్పాన్స్ ల‌భించింది. ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. ఈ సినిమాలో తొలి లిరికల్  వీడియో  సాంగ్ ను మే డే సంద‌ర్భంగా  సెన్షేష‌న‌ల్  డైరెక్ట‌ర్ వి. వి.వినాయ‌క్ విడుద‌ల చేయ‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌ల‌లో ఒక‌రైన ర‌మ‌ణారెడ్డి మాట్లాడుతూ, సినిమాలో   పాట‌ల‌న్నీ వేటిక‌వి  ప్ర‌త్యేకంగా ఉంటాయి. మొద‌టి పాటను మేడే సంద‌ర్భంగా వి.వి.వినాయ‌క్ గారు చేతుల మీదుగా లాంచ్ చేస్తున్నాం. పాట చాలా బాగుంటుంది. అలాగే సినిమా కూడా బాగా వ‌చ్చింది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు సినిమా త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది  అని అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు శ్రీధ‌ర్ ఎన్. మాట్లాడుతూ, నాకిది తొలి సినిమా అయినా నిర్మాత‌లు స‌హ‌కారంతో అనుకున్న‌ది అనుకున్న‌ట్లు తీయ‌గ‌లిగాను. సాయి కార్తీక్ సంగీతం సినిమాకు హైలైట్ గా ఉంటుంది. ప‌సిడి ప‌ల్లెలోనా అంటూ సాగే తొలి లిరిక‌ల్ వీడియో పాట‌ను మే 1న విడుద‌ల చేస్తున్నాం.

వినాయ‌క్ గారు ఆ పాట‌ను లాంచ్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది.  కొరియో గ్రాఫ‌ర్స్ భాను మాస్ట‌ర్, గ‌ణేష్ మాస్ట‌ర్ కంపోజ్ చేసిన పాట‌లు సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి. సినిమా కూడా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను  ఆక‌ట్టుకుంటుంది అని అన్నారు.

మ‌రో నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ, ఇప్ప‌టివ‌ర‌కూ క‌మెడీయ‌న్ గా అన్ని చిత్రాల్లో ప్ర‌ధాన భూమిక‌ను పోషించిన శంక‌ర్ న‌ట విశ్వ‌రూపం ఈ శంభో శంక‌ర చిత్రం ద్వారా ప్రేక్ష‌కులు చూడ‌బోతున్నార‌ని క‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌ను. అగ్ర క‌థానాయ‌కుల‌కు ఏ మాత్రం తగ్గ‌కుండా శంక‌ర్ న‌టించాడు. అత‌ను చేసిన  ఫైట్స్, డాన్సులు ప్రేక్ష‌కుల‌ను బాగా అల‌రిస్తాయి.

శంక‌ర్ కోసం మళ్లీ మ‌ళ్లీ థియేట‌ర్ కు వ‌చ్చి సినిమా చూస్తారు. అలాగే శంక‌ర్  త‌న స్టైల్ కామెడీతో అల‌రించ‌డ‌మే కాకుండా,  సెంటిమెంట్ స‌న్నివేశాల్లో ఆడ‌వాళ్ల‌నే కాకుండా  మ‌గ‌వాళ్లచే కూడా కంట‌త‌డి పెట్టిస్తాడు. ఇక తొలి లిరిక‌ల్ సాంగ్ ను వినాయ‌క్ గారు లాంచ్ చేయ‌డం సినిమాకు బాగా క‌లిసొస్తుంది. పాట అద్భుతంగా ఉంటుంది అని అన్నారు.

ఇందులో శంక‌ర్ స‌ర‌స‌న కారుణ్య హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ చిత్రానికి పాట‌లు:  భాస్క‌ర భ‌ట్ల ర‌వికుమార్, సంతోష్ సాకె, మాట‌లు: భ‌వానీ ప్ర‌సాద్,  ఛాయాగ్ర‌హ‌ణం:  రాజ‌శేఖ‌ర్, సంగీతం:  సాయి కార్తీక్, ఎడిటింగ్ :  ఛోటా.కె. ప్ర‌సాద్, ఆర్ట్: ర‌ఘు కుల‌క‌ర్ణి, క‌థ‌, స్ర్కీన్ ప్లే, ద‌ర్శ‌కత్వం:  శ్రీధ‌ర్. ఎన్.

More News

చ‌ర‌ణ్ మూడోసారీ హిట్ కొడ‌తాడా?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌కు ఇప్ప‌టివ‌ర‌కు సంక్రాంతి సీజ‌న్ బాగానే క‌లిసొచ్చింద‌నే చెప్పాలి.  ఇప్ప‌టికే ఈ పండ‌గ సంద‌ర్భంలో వ‌చ్చిన‌ రెండు సినిమాల‌తోనూ విజ‌యం సాధించారు ఈ యంగ్ హీరో.

నివేదా హీరోయిన్ కాద‌ట‌

'జెంటిల్‌మన్', 'నిన్నుకోరి', 'జై లవకుశ' చిత్రాల‌తో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది కేర‌ళ‌ కుట్టి నివేదా థామస్.

మ‌హేష్‌ను వెంటాడుతున్న సెంటిమెంట్‌

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం 'భరత్ అనే నేను'  బాక్సాఫీస్ వ‌ద్ద‌ విజయం వైపు పరుగులు తీస్తోంది.

గ్రామీణ నేపథ్యంలో ఎన్టీఆర్ మూవీ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న‌ విషయం తెలిసిందే.

తొలిసారి సంక్రాంతి బరిలో బోయపాటి ఫిల్మ్

తెలుగులో యాక్షన్ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన‌ దర్శకుల‌లో బోయపాటి శ్రీను ఒక‌రు. ‘భద్ర’ సినిమాతో దర్శకుడిగా పరిచయమై