చిరుని అలా టార్గెట్ చేసిన వినాయక్
Send us your feedback to audioarticles@vaarta.com
నృత్యాలకి పెట్టింది పేరు మెగాస్టార్ చిరంజీవి. అలాంటి చిరు నర్తించిన పాటలు రీమిక్స్ రూపంలో ఇటీవల కాలంలో బాగానే సందడి చేస్తున్నాయి. హీరోల్లో చిరు పాటల్ని రీమిక్స్ చేసి విజయం సాధించినవారు రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ కాగా...దర్శకుల విషయానికి వస్తే చిరంజీవికి వీరాభిమాని అయిన వి.వి.వినాయక్, అవకాశం దొరికితే చిరు పాటలని రీమిక్స్ చేయడానికి వెనుకాడడం లేదు.
మాస్ కథల్లో యాక్షన్, కామెడీలను మిక్స్ చేసి సినిమాలు తీయడంలో దిట్ట అయిన ఈ డైరెక్టర్.. రామ్ చరణ్ హీరోగా 2013లో వచ్చిన నాయక్` చిత్రంలో 90వ దశకంలో చిరంజీవి నటించిన కొండవీటి దొంగ` మూవీలోని “శుభలేఖ రాసుకున్న” పాటను రీమిక్స్ చేసి విజయం సాధించారు. ఇప్పుడు సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఇంటిలిజెంట్` సినిమాలో “చమక్ చమక్” సాంగ్ రీమిక్స్ చేసారు. ఇలా ఒకే సినిమాలోని రెండు పాటలను ఒకే డైరెక్టర్ రీమిక్స్ చేయడం విశేషం. అలాగే ఈ మూడు సినిమాలకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే ....కొండవీటి దొంగ` మార్చి 9 (1990)న విడుదల కాగా...వినాయక్ డైరెక్షన్లో చరణ్ హీరోగా వచ్చిన నాయక్` జనవరి 9 (2013)న రిలీజ్ కాగా.. అలాగే ఇంటిలిజెంట్` ఫిబ్రవరి 9 (2018)న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొత్తానికి...రీమిక్స్ విషయంలోనే కాదు.. డేట్ విషయంలోనూ (9) 'కొండవీటి దొంగ'ని బాగానే ఫాలో అయ్యారు వి.వి.వినాయక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com