వి. వి. వినాయక్ చేతులు మీదుగా 'రాజా నరసింహ' ట్రైలర్ ఆవిష్కరణ

  • IndiaGlitz, [Tuesday,November 05 2019]

మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముటీ కథానాయకుడిగా రూపొందిన 'మధుర రాజా' చిత్రం తెలుగులో 'రాజా నరసింహా'గా అనువాదమవుతోంది. 'మన్యం పులి' (పులి మురుగన్‌) సినిమాతో విజయం అందుకున్న వైశాఖ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జై, మహిమా నంబియార్‌ కీలక పాత్రధారులు. జగపతిబాబు ప్రతినాయకుడిగా కనిపిస్తారు. జై చెన్నకేశవ పిక్చర్స్‌ పతాకంపై సాధు శేఖర్‌ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మంగళవారం అగ్ర దర్శకుడు వి.వి.వినాయక్‌ చేతులు మీదుగా ట్రైలర్‌ను ఆవిష్కరించారు. 'చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ ఈ రాజా, రాజా బ్యాచ్‌ స్టాంగ్‌ అని. డబుల్‌ స్ట్రాంగ్‌ కాదు.. ట్రిపుల్‌ స్ట్రాంగ్‌ ' అని ట్రైలర్‌లో మమ్ముటీ చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంటోంది.

వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ ''ట్రైలర్‌ పవర్‌ఫుల్‌గా ఉంది. టైటిల్‌ కరెక్ట్‌గా యాప్ట్‌ అయింది. మలయాళంలో విజయవంతమైన ఈ చిత్రం తెలుగులో కూడా పెద్ద హిట్‌ అయ్యి, నిర్మాతకు మంచి పేరు, లాభాలు రావాలి'' అని అన్నారు.

నిర్మాత సాధు శేఖర్‌ మాట్లాడుతూ ''వినాయక్‌గారి చేతులమీదుగా ట్రైలర్‌ విడుదల కావడం ఆనందంగా ఉంది. చక్కని సందేశంతో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. మమ్ముటీ పవర్‌ఫుల్‌ యాక్షన్‌తో పాటు ప్రతినాయకుడిగా జగపతిబాబు క్యారెక్టర్‌, గోపీ సుందర్‌ సంగీతం, సన్నీలియోన్‌ ప్రత్యేక గీతం సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. మలయాళంలో వంద కోట్లు వసూలు చేసి ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. 'యాత్ర' లాంటి సూపర్‌హిట్‌ తర్వాత మమ్ముటీ నుంచి వస్తున్న మంచి చిత్రమిది. అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 22న సినిమాను విడుదల చేస్తున్నాం'' అని అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: నూల అశోక్‌, నిర్మాణ సారధ్యం: వడ్డీ రామానుజం, పురం రాధాకృష్ణ.

More News

అజర్‌బైజాన్‌లో '90 ఎంఎల్‌' పాటల చిత్రీకరణ పూర్తి...

'ఆర్‌ఎక్స్100' ఫేమ్‌ కార్తికేయ నటిస్తోన్న మరో విభిన్న చిత్రం '90 ఎం.ఎల్‌'. శేఖర్‌ రెడ్డి ఎర్ర దర్శకునిగా పరిచయమవుతున్నారు.

ప‌వ‌న్ కోసం సిద్ధమవుతోన్న సెట్

జ‌న‌సేన‌నాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ సినిమా `పింక్‌`ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

హత్య కేసులో కీలక ఆధారం కానున్న ‘అమెజాన్ అలెక్సా’

ఓ హత్య కేసులో సౌండ్ రికార్డర్ అమెజాన్ అలెక్సా కీలక ఆధారంగా మారనుంది.

పాట‌తో ప్రారంభించ‌నున్న చిరు

`ఖైదీ నంబ‌ర్ 150`తో గ్రాండ్‌గా రీ-ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి... తాజాగా హిస్టారిక‌ల్ డ్రామా `సైరా.. న‌ర‌సింహారెడ్డి`తో మ‌రో భారీ విజ‌యాన్ని అందుకున్నారు.

ల‌స్ట్ స్టోరీస్‌పై నందినీ రెడ్డి వివ‌ర‌ణ‌

డిజిటల్ మీడియా హ‌వా కొన‌సాగుతున్న త‌రుణంలో ప‌లు వెబ్ సిరీస్‌లు రూపొంద‌నున్నాయి. ఈ వెబ్‌సిరీస్‌ల ట్రెండ్ త‌మిళం, తెలుగులోనూ స్టార్ట్ అయ్యాయి.