"మళ్లీ మళ్లీ చూశా"  సాంగ్ లాంఛ్ చేసిన వి .వి వినాయక్

  • IndiaGlitz, [Wednesday,January 30 2019]

అనురాగ్ కొణిదెన హీరోగా పరిచయమవుతొన్న చిత్రం మళ్లీ మళ్లీ చూశా. క్రిషి క్రియేషన్స్ పతాకంపై సాయిదేవ రామన్ దర్శకత్వంలో కొణిదెన కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్వేత అవస్తి, కైరవి తక్కర్ హీరొయిన్ లుగా నటిస్తున్నారు.శ్రవణ్ భరద్వాజ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం లొని చినుకే నాకె చూపె అనే పాట ను ఆదిత్య మ్యూజిక్ ద్వారా సెన్సేషనల్ డైరక్టర్ వినాయక్ విడుదల చేశారు.

వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. మళ్లీ మళ్లీ చూశా పాట వినసొంపుగా ఉంది. ట్రైలర్ సైతం అందంగా అందరికీ చెరువయ్యేలా ఉంది. హీరో అనురాగ్ లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.

దర్శకుడు సాయిదేవ రామన్ .. ప్రేమకు ప్రకృతి తోడైతే ఎంతో అందంగా ఉంటుందన్న కాన్సెప్ట్ తొ తీసిన సినిమా మళ్ళీ మళ్ళీ చూశా . శ్రవణ్ సంగీతం, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ ఎసెట్స్ గా నిలుస్తాయి. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.

నిర్మాత కోటేశ్వరరావు కొణిదెన మాట్లాడుతూ.. మా చిత్రం లోని మొదటి పాటను వినాయక్ గారు విడుదల చేసినందుకు ధన్యవాదాలు. మనస్సుకు హత్తుకునే అహ్లాదకరమైన చిత్రం మా మళ్లీ మళ్లీ చూశా అన్నారు.

హీరొ అనురాగ్ మాట్లాడుతూ.. ‌వి .వి వినాయక్ గారు మొదటి పాటను విడుదల చేయడం చాలా ఆనందంగా వుంది . తెలుగులో చాలా రోజుల తర్వాత వస్తోన్న ఆహ్లాదకరమైన ప్రేమ కధా చిత్రం. కథే ఈ చిత్రానికి ప్రధాన బలం. మళ్లీ మళ్లీ చూడాలనిపించె ప్రేమకథ ఇదన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయి సతీష్ పాలకుర్తి మాట్లాడుతూ బిజీ గా ఉన్నప్పటికీ అడగ్గానే మా సాంగ్ ను లాంచ్ చేసిన వినాయక్ గారికి ధన్యవాదాలు. మళ్లీ మళ్లీ చూసేలా సినిమా ఉంటుందని అన్నారు.

More News

పార్టీ మారిన నేతలకు చురకలంటించిన సింగర్ బాలు! 

లెజండరీ సింగర్ బాలసుబ్రమణ్యం రాజకీయ నేతలకు గట్టిగానే క్లాస్ పీకారు. తాను చెప్పాల్సిందంతా చెప్పేసి చివర్లో తిన్నగా తనకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదంటూ చెప్పుకొచ్చారు.

'సకలకళావల్లభుడు' ఫిబ్రవరి 1న విడుదల

బీరం సుదాకరెడ్డి సమర్పణలో సింహా ఫిలిమ్స్, మరియు దీపాల ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'సకల కళా వల్లభుడు'.

జయంత్ సి పరాన్జీ 'నరేంద్ర' సినిమాలో నటించనున్న WWE రెజ్లింగ్ స్టార్ "ది గ్రేట్ ఖలీ"..!!

ఇండియన్ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్మెంట్ (WWE) రెజ్లర్ 'ది గ్రేట్ ఖలీ' టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం అయ్యింది.. ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో

జనసేనలో ఎందుకు చేరాలి.. హేమ షాకింగ్ కామెంట్స్!

టైటిల్ చూడగానే.. ఇదేంటి ఈ మాటలు అన్నది నిజంగానే సినీ నటి హేమేనా..?

ఇదే జరిగితే నెల్లూరులో వైసీపీ ఖాళీ..!?

ఎన్నికల ముందు వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగలనుందా..? కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో వైసీపీ ఖాళీ కానుందా..?