'ఏదైనాజరగొచ్చు' టీజర్‌ను విడుదల చేసిన వినాయక్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ నటుడు శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా హీరోగా పరిచయమవుతోన్న చిత్రం 'ఏదైనా జరగొచ్చు'. వెట్ బ్రెయిన్ ఎంటర్‌టైన్‌మెంట్, సుధర్మ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె.రమాకాంత్ దర్శకుడు. పూజా సోలంకి, సాషాసింగ్ హీరోయిన్స్.ఈ సినిమా టీజర్‌ను సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా వి.వి.వినాయక్ మాట్లాడుతూ - "నేను అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పటి నుండి శివాజీరాజాతో మంచి పరిచయం ఉంది. మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆయనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన తనయుడు విజయ్ రాజా హీరోగా పరిచయం అవుతున్నారు. తను సినీ పరిశ్రమలో పెద్ద స్టార్‌గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో విలన్‌గా నటించిన బాబీ సింహ తమిళంలో పెద్ద నటుడు. ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను" అన్నారు.
శివాజీ రాజా మాట్లాడుతూ - "వినాయక్‌గారి చేతుల మీదుగా టీజర్ విడుదల కావడం ఆనందంగా ఉంది. ఆయనకు నా స్పెషల్ థాంక్స్. 'ఏదైనా జరగొచ్చు' సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెడుతున్న మా అబ్బాయి విజయ్ రాజాను ఆశీర్వదించండి" అన్నారు.
దర్శకుడు రమాకాంత్ మాట్లాడుతూ - "ఇదొక క్రైమ్ హారర్ థ్రిల్లర్. మంచి టీం కుదిరింది. నటీనటులు, సాంకేతిక నిపుణులకు థాంక్స్. మంచి సపోర్ట్ అందిస్తున్నారు. అలాగే మా సినిమా టీజర్‌ను విడుదల చేసి, యూనిట్‌ను అభినందించిన వినాయక్‌గారికి థాంక్స్" అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com