తెలుగు »
Cinema News »
కసి, పట్టుదల ఉంటే ఏం చేయచ్చు అనేది చిరంజీవి గారు ఖైదీ నెం 150 లో చూపించారు - వినాయక్
కసి, పట్టుదల ఉంటే ఏం చేయచ్చు అనేది చిరంజీవి గారు ఖైదీ నెం 150 లో చూపించారు - వినాయక్
Tuesday, January 10, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ఆది, చెన్నకేశవరెడ్డి, దిల్, ఠాగూర్, బన్ని, లక్ష్మి, కృష్ణ, అదుర్స్, నాయక్....ఇలా సక్సెస్ ఫుల్ మూవీస్ అందించిన డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్. తాజాగా మెగాస్టార్ 150వ చిత్రం ఖైదీ నెం 150 చిత్రాన్ని తెరకెక్కించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై తొలిసారి నిర్మాతగా మారి ఈ భారీ చిత్రాన్ని నిర్మించారు. తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత చిరంజీవి నటించిన సినిమా కావడంతో ఖైదీ నెం 150 చిత్రం పై అటు అభిమానుల్లో, ఇటు ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతి కానుకగా ఖైదీ నెం 150 చిత్రం ఈనెల 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా డైనమిక్ డైరెక్టర్ వినాయక్ తో ఇంటర్ వ్యూ మీకోసం...!
ఖైదీ నెం 150 రిలీజ్ అవుతుంది కదా..! టెన్షన్ ఫీలవుతున్నారా..?
ఎందుకో తెలియదు...నాకు అస్సలు టెన్షన్ లేదు. హిట్ అయి సూపర్ హిట్ అయిన ఫీలింగ్ లో ఉన్నాను. దానికి కారణం చిరంజీవి గారు సినిమా చూసి హగ్ చేసుకోవడం.
కత్తికి - ఖైదీ నెం 150కి మీరు చేసిన మార్పులు ఏమిటి..?
కత్తి సినిమా కథను మార్చలేదు. చిరంజీవి గార్కి కావాల్సిన ఎలిమెంట్స్ ను యాడ్ చేసాం. పాటలు, కామెడీ...ఇలా చిరంజీవి గారి దగ్గర నుంచి ఫ్యాన్స్, ఆడియోన్స్ ఏం ఆశిస్తారో అవన్నీ యాడ్ చేసాం. నీరు మీరు సాంగ్ చాలా బాగా వచ్చింది. ఈ సాంగ్ వినగానే నాకు తెలియకుండానే కళ్లంట నీళ్లు వచ్చాయి. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి గారు చాలా అద్భుతంగా రాసారు. ఇళయరాజా,కీరవాణి గారి స్ధాయిలో దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.
ఈ సినిమా చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మైండ్ లోకి వచ్చింది వినాయకే అని చిరంజీవి చెప్పారు. మీ ఫీలింగ్ ఏమిటి..?
అది నాకు పెద్ద కాంప్లిమెంట్ గా ఫీలవుతుంటాను. ఆయన నన్ను కత్తి సినిమా చూసావా అని అడిగారు. చూసాను కాకపోతే మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని చూడలేదు అని చెప్పాను.చూసిన తర్వాత చాలా బాగుంది అన్నయ్య నేను ఈ మార్పులు అనుకుంటున్నాను అని చెప్పాను. అప్పుడు పరుచూరి బ్రదర్స్, సత్యానంద్ గారు, బుర్రా సాయిమాధవ్ ...వీళ్లతో ఒక్కో వెర్షెన్ రాయించాను. ఆతర్వాత ఫైనల్ గా ఓ వెర్షెన్ రాసుకుని చిరంజీవి గార్కి చెప్పగానే చాలా బాగుంది అంటూ హగ్ చేసుకున్నారు. దీంతో నాకు బాగా కాన్పిడెన్స్ వచ్చింది.
అఖిల్ సినిమా ఫ్లాప్ తర్వాత మీరు చేసిన సినిమా ఇది. అఖిల్ ఫ్లాప్ తర్వాత ఆ డిప్రషన్ నుంచి ఎలా బయటపడ్డారు..?
ఆ డిప్రషన్ నుంచి నన్ను బయటపడేసింది అన్నయ్యే.
కత్తి చూసిన వాళ్లు ఎలా ఫీలవుతారు..? చూడని వాళ్లు ఎలా ఫీలవుతారు..?
కత్తి సినిమా చూడని వాళ్లు ఈ సినిమా చూస్తే థ్రిల్ ఫీలవుతారు. కత్తి సినిమా చూసిన వాళ్లు చిరంజీవి గారు బాగా చేసారు. ఈ సినిమాని మార్పులతో చాలా బాగా తీసారు అనుకుంటారు. నాకు ఇంత మంచి కథ ఇచ్చిన మురుగుదాస్ గార్కి మనస్పూర్తిగా థ్యాంక్స్ తెలియచేస్తున్నాను.
ఖైదీ నెం 150 టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి..?
జస్టిఫికేషన్ అంటే...కమర్షియల్ టైటిల్. చిరంజీవి గారు ఖైదీ నుంచి ప్రయాణం మొదలుపెట్టారు అనుకుంటే 150 సినిమాల వరకు వచ్చారు అని నా ఫీలింగ్.
కథను ఒక్క మాటలో చెప్పమంటే ఏం చెబుతారు..?
వేల రూపాయలు చూడని ఓ రైతు వేల కోట్ల రూపాయలు ఉన్న కార్పోరేట్ కంపెనీ పవర్ వలన బాధపడుతుంటే ఆ రైతుని నాయకుడు ఎలా గెలిపించాడు అనేది కథ.
150వ సినిమాకి రీమేక్ నే ఎంచుకోవడానికి కారణం ఏమిటి..?
సింపుల్ గా చెప్పాలంటే హిట్ అవుతుందనే...(నవ్వుతూ..) అన్ని కలిసి ఉన్న కథ ఇది. రీమేక్ చేయడం తప్పు ఏమీ కాదు. ఇదే సినిమాని డబ్బింగ్ చేస్తే ఇంత బిజినెస్ జరగదు. ఈ సినిమా చూడగానే మళ్లీ చిరంజీవి గారు ఇలాంటి సినిమాలు చేస్తున్నారని రైటర్స్ కథలు రాసేలా ఉంటుంది.
ఠాగూర్ తో పోలీస్తే ఖైదీ నెం 150 ఎలా ఉంటుంది..?
ఖచ్చితంగా ఠాగూర్ సినిమా కంటే బెటర్ గానే ఉంటుంది. ఆ స్ధాయికి ఏమాత్రం తగ్గదు.ఆరోజుకి ఈరోజుకి ఆడియోన్స్ పెరిగారు రెవెన్యూస్ పెరిగాయి.ఆ సినిమాలో కన్నా కొంచెం ఎంటర్ టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది. నీరు అనే సాంగ్ ఎంత ఇంపేక్ట్ తీసుకువచ్చిందో...చిరంజీవి గారు రైతులను ఉద్దేశించి మాట్లాడే సీన్ ఉంటుంది.రైతుల బాధలను ఆయన చెప్పినప్పుడు రొమాంచితంగా ఉంటుంది.
చిరంజీవి పాలిటిక్స్ కి హెల్ప్ అయ్యాలా ఉంటుందా..?
పాలిటిక్స్ కి ఈ సినిమాకి సంబంధం లేదు. సినిమా హీరోగా ఆయన్ని ఎంతలా ప్రేమిస్తారు అనేది ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చూసాం. అడ్వాన్స్ బుకింగ్ లో చూసాం. సినిమా హీరోగా ఆయన స్ధానం ప్రజల గుండెల్లో అలాంటిది.
ఠాగూర్ - ఖైదీ నెం 150కి చిరంజీవిలో మీరు గమనించిన తేడా ?
నటుడుగా అప్పటికీ ఇప్పటికీ ఏమాత్రం తేడా లేదు. పర్సనల్ గా అంటే ఠాగూర్ కంటే ఎక్కువ అందంగా ఉన్నారు. 60 ఏళ్లు వయసు అయిపోయింది అనుకున్న వారందరికీ ఒక మార్గదర్శకం అవుతారు. కసి, పట్టుదల ఉంటే ఏం చేయచ్చు అనేది ఈ సినిమాలో చూపించారు. ఇంకా చెప్పాలంటే చూడాలనివుందిలో ఎలా ఉన్నారో అలా ఉన్నారు. ఓరోజు ఇంటికి వెళితే...ఒక చేయికి దెబ్బతగిలితే ఆ చేయికి బ్యాగ్ లా వేసారు. అలాంటి పరిస్థితుల్లో వేరే చేతితో ఎక్స్ ర్ సైజ్ చేస్తున్నారు. ఎంత కసి ఉంటే అంతలా వర్క్ చేస్తారు అనిపించింది.
కాజల్ ను ఎంపిక చేయాలన్నది ఎవరి ఛాయిస్...?
నా ఛాయిసే. ఫస్ట్ నుంచి అనుష్క లేకపోతే కాజల్ అనుకున్నాను.అనుష్క బాహుబలి, ఓం నమో వేంకటేశాయ షూటింగ్స్ లో బిజీగా ఉండడం వలన కుదరలేదు. ఫైనల్ గా కాజల్ ను సెలెక్ట్ చేసాం. హీరోతో పాటు పోరాటంలో తను కూడా భాగమై ఉంటుంది.
చిరంజీవి - చరణ్ ఇద్దరిలో మీరు గమనించిన తేడా ఏమిటి..?
సెట్ లో చరణ్ తన వర్క్ ఏమిటి అనేది చూసుకుని వెళ్లిపోతాడు. చిరంజీవి గారు తన వర్క్ తో పాటు మొత్తం ఎలా జరుగుతుంది అనేది చూస్తారు.
ప్రొడ్యూసర్ గా చరణ్ గురించి ఏం చెబుతారు..?
చరణ్ ప్రొడ్యూసర్ అంటే ఏ లోటు ఉండదు.
చరణ్ ఈ సినిమాలో నటించాడా..?
ఒక సాంగ్ లో కనిపిస్తాడు. ఫ్యాన్స్ కోసం పెట్టాం
కుమ్ముడు సాంగ్ లో తమ్ముడు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ కనిపిస్తారు అనుకుంటున్నారు..?
లేదండి పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో నటించలేదు.
పృధ్వీ క్యారెక్టర్ చేయించిన తర్వాత తీసేసారట కదా..కారణం ఏమిటి..?
పృధ్వీ ఓ మినిష్టర్ క్యారెక్టర్ చేసాడు. లెంగ్త్ ఎక్కువు అవుతుంది అని తీసేసాం. లెంగ్త్ ఎక్కువ కావడం వలన ఇలా జరిగింది అని నేను ఫోన్ చేసి మరీ పృధ్వీకి చెప్పాను. అయితే...చిరంజీవి గారి 150 సినిమాలో నటించాను కానీ తీసేసారు అమ్మ చనిపోయినంత బాధగా ఉంది అని ఫేస్ బుక్ లో రాసాడట. అది పేపర్ లో వచ్చేసరికి అది చూసి నాకే చాలా బాధగా అనిపించింది. చిరంజీవి గారు కూడా అతన్ని ఎందుకు బాధపెట్టడం లెంగ్త్ ఎక్కువ అయితే అయ్యింది యాడ్ చేయి అనడంతో మళ్లీ పృథ్వీ క్యారెక్టర్ ను యాడ్ చేసాం.
బ్రహ్మానందం క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?
నేను రఘుబాబు, జయప్రకాష్ రెడ్డిలతో ఓ ఎపిసోడ్ తీసాను. అయితే చిరంజీవి గారు చూసి నాకు బ్రహ్మానందం కావాలి అన్నారు. అప్పుడు వేరే వెర్షెన్ రాయించి బ్రహ్మానందం గారితో ఆ ఎపిసోడ్ తీసాం చాలా బాగా వచ్చింది.
ఖైదీ నెం 150 చిరంజీవి గత చిత్రాలతో పోలిస్తే ఎలా ఉంటుంది..?
ఇంద్ర సినిమాల సాంగ్స్, రౌడీ అల్లుడులా కామెడీ, ఠాగూర్ లా నిజాయితీ ఉంటుంది.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?
ప్రస్తుతం నా ఆలోచన అంతా ఈ సినిమా గురించే. తదుపరి చిత్రం గురించి త్వరలో చెబుతాను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments