వినాయక్ హ్యాట్రిక్ ?
- IndiaGlitz, [Thursday,November 05 2015]
మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుడు వి.వి.వినాయక్. తీసిన సినిమాల్లో సింహభాగం బాక్సాఫీస్ హిట్లే. అలాంటి దర్శకుడు నుంచి వస్తున్న తాజా చిత్రం 'అఖిల్'. అక్కినేని అఖిల్ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమా దీపావళి కానుకగా ఈ నెల 11న రానుంది. ఇదిలా ఉంటే.. 'నాయక్', 'అల్లుడు శీను' వంటి హిట్ చిత్రాల తరువాత వస్తున్న 'అఖిల్'తో వినయ్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని వినిపిస్తోంది.
అంతేకాదు.. ఆ రెండు చిత్రాల్లో వినయ్ వాడిన ట్రిక్.. 'అఖిల్'లోనూ ఉందని వినిపిస్తోంది. ఇంతకీ అదేమిటంటే.. డబుల్ రోల్. 'నాయక్' కోసం రామ్‌చరణ్ డ్యూయెల్ రోల్.. 'అల్లుడు శీను' కోసం ప్రకాష్ రాజ్ డబుల్ రోల్ ఎలాగైతే ఆ సినిమాల విజయాల్లో కీలక పాత్రలు వహించాయో.. అలాగే 'అఖిల్'లోనూ ఓ డ్యూయెల్ రోల్ ఉందని.. ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో త్వరలోనే తెలుస్తుంది.