హీరోగా వి.వి.వినాయక్
Send us your feedback to audioarticles@vaarta.com
స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వం నుండి యాక్టింగ్ వైపు అడుగులు వేస్తున్నారని వార్తలు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. స్టార్ డైరెక్టర్ శంకర్ శిష్యుడు.. శరభ ఫేమ్ నరసింహారావు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్నో విజయవంతమైన చిత్రాలను డైరెక్ట్ చేసిన వినాయక్‌కు నటన ఏమీ కొత్త కాదు.. తొలిసారి ఈయన చిరంజీవి ఠాగూర్ చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించారు.
తర్వాత పలు చిత్రాల్లో తళుకున్న మెరిశారు. అయితే ఇప్పుడు ఏకంగా కథానాయకుడుగా మెప్పించడానికి సన్నద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తారట. ప్రస్తుతం తిరుమలలో ఉన్న దిల్‌రాజు హైదరాబాద్ చేరుకోగానే అధికారిక ప్రకటన చేస్తారని టాక్. తన ఏజ్‌కు తగ్గ కథ కావడంతో వినాయక్ కూడా ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించినట్లు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com