ఖైదీ నెం 150 రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన వినాయక్..!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న150 చిత్రం ఖైదీ నెం 150. డైనమిక్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వంలో ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్వరలో మెగాస్టార్, కేథరిన్ పై ఐటం సాంగ్ చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ భారీ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్రయూనిట్ గతంలో ప్రకటించారు. అయితే...తాజాగా డైరెక్టర్ వినాయక్ ఈ విషయాన్ని మరోసారి కన్ ఫర్మ్ చేసారు. ఇటీవల రాజమండ్రిలోని విద్యా గణపతి ఆలయాన్ని సందర్శించిన వినాయక్ మీడియాతో మాట్లాడుతూ....చిరంజీవి సినిమా అనుకున్న విధంగా చాలా బాగా వస్తుంది. అందరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాను. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని జనవరి 13న రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments