ఖైదీ నెం 150 రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన వినాయ‌క్..!

  • IndiaGlitz, [Thursday,September 08 2016]

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న‌150 చిత్రం ఖైదీ నెం 150. డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లో మెగాస్టార్, కేథ‌రిన్ పై ఐటం సాంగ్ చిత్రీక‌రించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ భారీ చిత్రం సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని చిత్ర‌యూనిట్ గ‌తంలో ప్ర‌క‌టించారు. అయితే...తాజాగా డైరెక్ట‌ర్ వినాయ‌క్ ఈ విష‌యాన్ని మ‌రోసారి క‌న్ ఫ‌ర్మ్ చేసారు. ఇటీవ‌ల రాజ‌మండ్రిలోని విద్యా గ‌ణ‌ప‌తి ఆల‌యాన్ని సంద‌ర్శించిన వినాయ‌క్ మీడియాతో మాట్లాడుతూ....చిరంజీవి సినిమా అనుకున్న విధంగా చాలా బాగా వ‌స్తుంది. అంద‌రికీ న‌చ్చేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాను. సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 13న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు తెలిపారు.

More News

చిరు- నాగ్ - స‌చిన్ లుంగీ డ్యాన్స్..!

కేర‌ళ బ్లాష్ట‌ర్స్ జ‌ట్టుకు స‌చిన్ టెండూల్క‌ర్, చిరంజీవి, నాగార్జున‌, నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్, అల్లు అర‌వింద్ స‌హ య‌జ‌మానులుగా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఈ కేర‌ళ బ్లాష్ట‌ర్స్ జ‌ట్టు మూడో సీజ‌న్ కు రెడీ అవుతున్నారు.

మన ఊరి రామాయణం సస్పెన్స్ టీజర్ రిలీజ్..!

జాతీయ ఉత్తమనటుడు ప్రకాష్ రాజ్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ రూపొందించిన ద్విభాషా చిత్రం మన ఊరి రామాయణం.

క్రిస్మస్ రేసులో నాని...

నేచురల్ స్టార్ నాని హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందనున్న చిత్రం

పూరితో ఎన్టీఆర్‌

టెంప‌ర్‌, నాన్న‌కు ప్రేమ‌తో ఇప్పుడు జ‌న‌తాగ్యారేజ్ చిత్రాల‌తో హ్యాట్రిక్ హిట్ కొట్టిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా ఏంట‌నే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

ఆ డైరెక్ట‌ర్ తో చ‌ర‌ణ్ మ‌ళ్లీ సినిమా చేస్తున్నాడా..!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న ధృవ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రం త‌ర్వాత చ‌ర‌ణ్ సుకుమార్ తో సినిమా చేయ‌నున్నారు. ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ లో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.