వినాయక్ ప్రకటించేశాడు!
Send us your feedback to audioarticles@vaarta.com
వి.వి.వినాయక్ గత చిత్రం `ఇంటిలిజెంట్`. ఆ తర్వాత ఆయన సినిమాపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. నందమూరి బాలకృష్ణతో సినిమా చేస్తారనే వార్తలు వచ్చాయి కానీ, వాటిని గురించి అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు. అయితే తాజాగా వినాయక్ తన తదుపరి సినిమా గురించి అధికారికంగా ప్రకటించారు. ఆ సినిమాను సి.కల్యాణ్ నిర్మిస్తారు. ఈ సినిమాలో బాలకృష్ణ హీరో. `ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉంది. మంచి స్క్రిప్ట్ చేయాలనే కొన్నాళ్ల పాటు విరామం తీసుకున్నా.
ఇప్పుడు అంతా సిద్ధమైంది` అని వినాయక్ ప్రకటించారు. ప్రస్తుతం బాలకృష్ణ ఆయన తండ్రి యన్.టి.ఆర్ బయోపిక్‌తో బిజీగా ఉన్నారు. ఆ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలన్నది ఆయన సంకల్పం. అంటే 2019 జనవరి వరకు వినాయక్ సినిమా పట్టాలెక్కకపోవచ్చనేది సమాచారం. అయితే అంతలోపు పూజా కార్యక్రమాలను నిర్వహించి, మిగిలినఆర్టిస్టులతో ఉన్న పోర్షన్ని తెరకెక్కిస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. సి.కల్యాణ్ ఏ విషయాన్నీ చెప్పాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout