వినాయక్ ప్రకటించేశాడు!
- IndiaGlitz, [Friday,August 10 2018]
వి.వి.వినాయక్ గత చిత్రం 'ఇంటిలిజెంట్'. ఆ తర్వాత ఆయన సినిమాపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. నందమూరి బాలకృష్ణతో సినిమా చేస్తారనే వార్తలు వచ్చాయి కానీ, వాటిని గురించి అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు. అయితే తాజాగా వినాయక్ తన తదుపరి సినిమా గురించి అధికారికంగా ప్రకటించారు. ఆ సినిమాను సి.కల్యాణ్ నిర్మిస్తారు. ఈ సినిమాలో బాలకృష్ణ హీరో. 'ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉంది. మంచి స్క్రిప్ట్ చేయాలనే కొన్నాళ్ల పాటు విరామం తీసుకున్నా.
ఇప్పుడు అంతా సిద్ధమైంది' అని వినాయక్ ప్రకటించారు. ప్రస్తుతం బాలకృష్ణ ఆయన తండ్రి యన్.టి.ఆర్ బయోపిక్‌తో బిజీగా ఉన్నారు. ఆ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలన్నది ఆయన సంకల్పం. అంటే 2019 జనవరి వరకు వినాయక్ సినిమా పట్టాలెక్కకపోవచ్చనేది సమాచారం. అయితే అంతలోపు పూజా కార్యక్రమాలను నిర్వహించి, మిగిలినఆర్టిస్టులతో ఉన్న పోర్షన్ని తెరకెక్కిస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. సి.కల్యాణ్ ఏ విషయాన్నీ చెప్పాల్సి ఉంది.