Vrushabha:మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రల్లో 'వృషభ'..  ముంబైలో ప్రారంభమైన కొత్త షెడ్యూల్

  • IndiaGlitz, [Saturday,October 14 2023]

టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేకా, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ 'వృషభ'... 'ది వారియర్ అరైజ్' ట్యాగ్ లైన్. శనయ కపూర్‌, జహ్రా ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీఫిల్మ్స్, ఏవీఎస్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నంద కిషోర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నాని, జుహి పరేఖ్ మెహతా, శ్యామ్ సుందర్, ఏక్తా కపూర్, శోభా కపూర్, వరుణ్ మథూర్, సౌరభ్ మిశ్రాలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏకకాలంలో తెలుగు, మలయాళీ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ మూవీని హిందీ, కన్నడ, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేయబోతోన్నారు.

రోజు రోజుకీ ఎక్స్‌పెక్టేషన్స్‌ను పెంచుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ శుక్రవారం ముంబైలో ప్రారంభమైంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో ఈ భారీ షెడ్యూల్‌ను చిత్రీకరించేలా మేకర్స్ సన్నాహాలు చేశారు. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దసరా సందర్భంగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయబోతున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు. వృషభ రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుందనే ఆసక్తి అభిమానులతో పాటు సినీ లవర్స్, ట్రేడ్ వర్గాల్లోనూ క్రియేట్ అయ్యాయి. దసరా రోజున ఈ సస్పెన్స్‌కు తెరపడనుంది.

రోషన్ మేకా, మోహన్ లాల్, శనయ కపూర్, జహ్రా ఖాన్, శ్రీకాంత్ మేకా, రాగిణి ద్వివేదిల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మూన్ లైట్ (2016), థ్రీ బిల్‌బోర్డ్స్ అవుట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరీ (2017) వంటి ఎన్నో హాలీవుడ్ సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన హాలీవుడ్ కి చెందిన నిక్ తుర్లో నిక్ తుర్లోని ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వ్యవహరిస్తుండటం విశేషం. బాహుబలి, మన్యం పులి, ది బాస్, గజిని, రోబో, పుష్ప ది రైజ్ వంటి సినిమాలకు పని చేసి యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ ఈ సినిమాకు ఫైట్స్ డిజైన్ చేస్తున్నారు.

More News

DSC Exam:తెలంగాణలో నిరుద్యోగులకు బ్యాడ్ న్యూస్.. డీఎస్సీ పరీక్ష వాయిదా

తెలంగాణలో నిరుద్యోగులకు మరో నిరాశ ఎదురైంది. ఇప్పటికే గ్రూప్2 పరీక్షలు వాయిదా పడగా.. తాజాగా డీఎస్సీ పరీక్షను వాయిదా వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

Sajjala: చంద్రబాబు ప్రాణాలకు ముప్పు అంటూ టీడీపీ డ్రామాకు తెరలేపింది: సజ్జల

టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం విషమించిందంటూ టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ప్రాణాలకు ప్రమాదం ఉందంటూ

Chandrababu:సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్లు మంగళవారానికి వాయిదా

సుప్రీంకోర్టులో టీడీపీ ఛీఫ్ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌, ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా పడింది.

SRK, Prabhas:ప్రభాస్‌తో పోటీకి వెనక్కి తగ్గిన షారుఖ్.. 'డంకీ' విడుదల తేదీ వాయిదా..!

బాలీవుడ్ బాద్‌ షా షారుఖ్ ఖాన్ (ShahRukhKhan) ఈ ఏడాది రెండు బ్లాక్ బాస్టర్ హిట్స్ ఇచ్చి మాంఛి ఊపు మీద ఉన్నాడు.

Ponnala Lakshmaiah:కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా

ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పార్టీకి రాజీనామా చేశారు.