కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. బైడెన్, ట్రంప్ మధ్య హోరాహోరీ
Send us your feedback to audioarticles@vaarta.com
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో ముగిసింది. కాగా.. పోలింగ్ ముగిసిన రాష్రాల్లో బుధవారం ఉదయం(భారత కాలమానం ప్రకారం) ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. అమెరికాలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. హోరాహోరీగా బైడెన్, ట్రంప్ మధ్య పోటీ నెలకొంది. తొలి ఫలితాల్లో డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు. ఇప్పటివరకు బైడెన్‌కు 119, ట్రంప్‌కు 92 ఎలక్టోరల్ ఓట్లు లభించాయి. ఇండియానా, ఓక్లాహామా, టెన్సాసీ, కెంటకీలో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు.
కాగా.. డీసీ, వెర్మాంట్, మాసాచుసెట్స్, డెలవెర్, న్యూజెర్సీ, మేరీలాండ్‌లో బైడన్ విజయం సాధించారు. సౌత్ కరోలైనా, వెస్ట్ వర్జీనియాలో ట్రంప్ విజయం సాధించగా.. న్యూహ్యాంప్‌షైర్‌లో బైడన్ ముందంజలో ఉన్నారు. ఫ్లోరిడా, జార్జియాలో డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. ట్రంప్‌తో సమానంగా బైడన్ దూసుకువస్తుండటం విశేషం. ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్‌లో ట్రంప్‌కు 50.2 శాతం, బైడెన్‌కు 49.7 శాతం ఓట్లు లభించాయి.
కాగా.. అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాల్లో 538 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో ముందస్తుగా దాదాపు 10 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 270 ఎలక్టోరల్ ఓట్లు సాధించేవారికి అధ్యక్ష పదవి లభించనుంది. విజేతను నిర్ణయించండంలో స్వింగ్ రాష్ట్రాల ఫలితాలు కీలకంగా మారనున్నాయి. వందేళ్లలో ఎప్పుడూ లేనంతగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్ జరగడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com