పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

  • IndiaGlitz, [Thursday,April 11 2019]

దేశవ్యాప్తంగా తొలి దశ ఎన్నికల సందడి ప్రారంభం అయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు... రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కాగా... ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు ప్రజలు. తొలి దశలో మొత్తం 91 లోక్ సభ నియోజక వర్గాలకు పోలింగ్ జరుగుతుండగా... ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల తో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.

ఫస్ట్ ఫేజ్ పార్లమెంటరీ ఎలక్షన్స్ లో 1279 మంది అభ్యర్ధులు పోటీ పడుతుండగా.... కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిరణ్ రిజిజు, వికే సింగ్, మహేష్ శర్మ, సత్య పాల్ సింగ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాగా ఏపీ లో 24, తెలంగాణలో 17, యూపీ లో 8, ఉత్తరాఖండ్ లో 5 లోక్ సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతుండగా..

మహారాష్ట్రలో 7, బీహార్ లో 6, అస్సాంలో 5, ఒడిశా లో 4, జమ్ము కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో రెండు చొప్పున అసెంబ్లీ స్థానాలకు... మిజోరాం, త్రిపుర, నాగాలాండ్, మణిపూర్, సిక్కిం, ఛత్తీస్ ఘడ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక్కో లోక్ సభ స్థానానికి పోలింగ్ జరుగుతోంది.

More News

ఓటు హ‌క్కు వినియోగించుకున్న చిరంజీవి, తార‌క్‌, బ‌న్ని

2019 అసెంబ్లీ, పార్ల‌మెంట్(లోక్‌స‌భ‌) స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. తెలంగాణ‌లో 17లో లోక్‌స‌భ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.

ఈవీఎంల మొరాయింపు పై సీఎం అసంతృప్తి

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో ఈసీ తీరుపై మొదటి నుంచి అసంతృప్తిగానే ఉన్నారు. ప్రతిపక్షానికి ఈసీ సపోర్ట్ చేస్తుందని అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

'RRR' లో నిత్యామీన‌న్‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ హీరోలుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ప్రెస్టీజియ‌స్‌గా రూపొందుతోన్న చిత్రం `RRR`.

మోది బయోపిక్‌కి బ్రేక్‌ 

భారత ప్రధాని నరేంద్రమోది బయోపిక్‌ 'పిఎం నరేంద్రమోది' బయోపిక్‌ విడుదలకి ఎన్నికల కమీషన్‌ అభ్యంతరం తెలియజేసింది. ఎన్నికలు అయ్యే వరకు సినిమా విడుదలను ఆపాల్సిందేనంటూ తేల్చేసింది

'లక్ష్మీస్ ఎన్టీఆర్' మళ్ళీ వాయిదా

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రారంభం నుంచి.... ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కు ముచ్చెమటలు పట్టించిన డైరెక్టర్ వర్మ....