జనాలు పిచోల్లా : జనసేన అధినేతకు ఓటర్ల ప్రశ్నలు

  • IndiaGlitz, [Friday,April 12 2019]

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలోని పడమటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే సీఎం కాండిడేట్ అయిన పవన్ క్యూ లో రాకుండా... జనాలను తీసుకెళ్ళి మరీ ఓటు వేశారని జాతీయ మీడియా న్యూస్ స్ప్రెడ్ చేస్తోంది. అయితే దీనిపై ప్రత్యక్ష సాక్షుల అభిప్రాయం వేర్వేరుగా ఉంది. కొందరు స్థానికులు తాము హైదరాబాద్ నుంచి ఓటు వేయడానికి వచ్చామని... కనీసం వాటర్ తాగకుండా మార్నింగ్ నుంచి క్యూలో నిల్చుంటే... పవన్ మాత్రం అందరినీ కాదని డైరెక్ట్ గా పోలింగ్ బూత్ లోకి ఎంటర్ అయి ఓటు వేశాడని... జనసేన అధినేతకు జనాలు పిచోళ్ల లా కనిపిస్తున్నార అని ప్రశ్నించారు.

అయితే పవన్ ఎంటర్ పోలింగ్ కేంద్రానికి చేరుకోగానే జనాలు సెల్ఫీ కోసం ఎగబడ్డారు అని... కావున సెక్యూరిటీ రీజన్స్ వల్లే... అధికారులే తనని ఓటు వేసేందుకు తీసుకెళ్లారు అని మరికొందరు స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటన ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ కాగా... దర్శకుడు మారుతి దాసరి దీనిపై స్పందించారు. ఇలాంటి వార్తలను నేషనల్ మీడియా ఎందుకు సెన్సేషన్ చేయాలి అనుకుంటుందో అర్దం కావడం లేదు అన్నారు. జనసేన కార్యకర్తలపై దాడి జరిగినప్పుడు మీడియా ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నించారు.