Manchu Family :ఏపీలో ఆ పార్టీలకే ఓటు వేయండి.. మంచు కుటుంబం వ్యాఖ్యలు వైరల్..
Send us your feedback to audioarticles@vaarta.com
తిరుపతిలో జరిగిన మోహన్ బాబు(Mohan Babu) జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, ముఖేష్ రుషి పాల్గొన్నారు. ఇక ఈ ఈవెంట్‌లో మంచు కుటుంబం రాజకీయ ప్రసంగాలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మంచు మనోజ్ స్పీచ్(Manchu Manoj) అయితే తెగ వైరల్ అవుతోంది.
"వాళ్ల ఫ్యామిలీకే హెల్ప్‌చేయనివాళ్లు. వాళ్ల చుట్టుపక్కల వారికే హెల్ప్ చేయనివాళ్లు. మీకేం హెల్ప్ చేస్తారు. అది గుర్తుపెట్టుకొని.. కరెక్ట్‌గా చూజ్ చేసుకొని మీకు మీ ఏరియాలో ఉన్న పేదవాళ్లకు ఏ లీడర్ వస్తే సపోర్టివ్‌గా ఉంటుందో అనలైజ్ చేసి కరెక్ట్‌గా ఓటు వేయండి. కష్టాల్లో ఉండి ఎక్కువ డబ్బు ఇచ్చే వాళ్లు ఉంటే వద్దని మీకు చెప్పను. ఆ డబ్బు ఇచ్చాడని ఓటు వేయొద్దు. డబ్బు ఇస్తే థాంక్యూ బ్రదర్ అని చెప్పండి. ఆ తర్వాత మీకు నచ్చిన వాళ్లకు ఓటు వేయండి. పదిమందిని కలుపుకొని వెళ్లే లీడర్‌ని వెతుక్కోండి" అని మనోజ్ తెలిపాడు.
ఇక మోహన్ బాబు కూడా ఈసారి పొలిటికల్ స్పీచ్ చేశాడు. "ప్రధాని నరేంద్ర మోదీని చాలా సందర్భాల్లో కలిశాను. అలాంటి ఆలోచనలు, విధానాలు కలిగిన వ్యక్తి దేశానికి అవసరం. ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలి. రాష్ట్రంలో రెండు పార్టీలకు చెందిన వారు డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు మనవే.. లంచాలు తీసుకున్న డబ్బులు.. ఆ డబ్బులు తీసుకోండి. ఓటును మాత్రం నచ్చిన వారికి వేయండి. రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లడానికి సహకరించండి." అని సూచించాడు.
దీంతో మంచు కుటుంబం చేసిన రాజకీయ ప్రసంగాలు వైరల్ అవుతున్నాయి. ఇంత సడెన్‌గా అది కూడా ఎన్నికల సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమయ్యాయి. మోహన్ బాబు మోదీకి సపోర్ట్‌గా మాట్లాడారు అంటే టీడీపీ-బీజేపీ-జనసేన కూటమికి ఓటు వేయమని పరోక్షంగా చెప్పినట్లే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక మనోజ్ వ్యాఖ్యలు కూడా పరోక్షంగా వైసీపీ నేతలకు ఓటు వేయొద్దని.. టీడీపీ, జనసేనకు ఓటు వేయమని సూచించినట్లు ఉన్నాయని భావిస్తున్నారు.
కాగా 2019 ఎన్నికల సమయంలో మంచు కుటుంబం మొత్తం వైఎస్‌ఆర్‌సీపీకి మద్దతు ప్రకటించింది. తన యూనివర్సిటీకి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు ఇవ్వడం లేదంటూ రోడ్డు మీద పడుకుని మరి ధర్నాలు చేశారు. మోహన్ బాబు అయితే బహిరంగంగా చంద్రబాబును తీవ్రంగా విమర్శించారు. జగన్‌తో కలిసి టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అయితే జగన్ సీఎం అయిన తర్వాత సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఆ పార్టీకి వ్యతిరేకంగా పరోక్షంగా పనిచేస్తున్నట్లు అర్థమవుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com