ప్రముఖ దర్శకులు విఎన్.ఆదిత్య, అమ్మ రాజశేఖర్ చేతుల మీదుగా 'సర్వం సిద్ధం' టీజర్ విడుదల

  • IndiaGlitz, [Tuesday,July 30 2019]

సినెటేరియా మీడియా వర్క్స్ బ్యానరుపై శ్రీమతి శ్రీలత బి వెంకట్ నిర్మిస్తున్న సర్వం సిద్దం - నవ్వుకున్నోళ్ళకు నవ్వుకున్నంత శరవేగంగా చిత్ర నిర్మాణం జరుపుకొంటోంది. అతిమల్ల రాబిన్ నాయుడు దర్శకత్వంలో 100% వినోదాత్మక చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం లోగో, ఫస్ట్ లుక్, టీజర్ మరియు పోస్టర్ లను చిత్ర బృందం జూబిలీ హిల్స్ లోని తల్వార్ హ్యుందాయ్ షోరూంలో ఘనంగా ఆవిశ్కరించింది.

ఈ కార్యక్రమంలో సినీ దర్శకులు వి.ఎన్ ఆదిత్య, అమ్మ రాజశేఖర్, సినెటేరియా గ్రూప్ సీఈవో వెంకట్ బులెమోని, ఎన్.సి.సి మార్కెటింగ్ హెడ్ శ్రీవికాస్, సింబయోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ సంచాలకులు డా. రవి కుమార్ జైన్, టెక్స్ టైల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అమ్మనబోలు ప్రకాశ్, ప్రముఖ సీఏ నితిన్ కె పరేఖ్, సినీ నటులు 'అక్కడొకడున్నాడు' శివ శంకర్, 'సమరం' చిత్ర హీరో సాగర్ జి, సర్వం సిద్దం చిత్ర కథానాయికలు లావణ్య, పూజ, ఫరీనా, నటులు సర్వం శ్రీనివాస్, మందార్, అభిషేక్, సిద్దేశ్వర్, త్రిషాంక్, వెంకటేష్, కిరణ్, దర్శకులు అతిమల్ల రాబిన్ నాయుడు, కెమెరామెన్ సంతోష్ రెడ్డి, నిర్మాత శ్రీమతి శ్రీలత బి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీనియర్ దర్శకులు వి.ఎన్.ఆదిత్య, అమ్మ రాజశేఖర్ లు సర్వం సిద్దం టీజర్ ను ఆవిష్కరించగా, ఎన్.సి.సి హెడ్ శ్రీవికాస్ చిత్ర లోగోను, టెక్స్ టైల్స్ అధ్యక్షులు అమ్మనబోలు ప్రకాష్ ఫస్ట్ లుక్, సినెటేరియా గ్రూప్ సీఈవో చిత్ర పోస్టర్ లను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా దర్శకులు వి ఎస్ ఆదిత్య మాట్లాడుతూ... చిత్ర టీజర్ ను చూసిన తరువాత, చలనచిత్ర రంగంలోని అలనాటి రోజులు గుర్తుకువచ్చాయన్నారు. టీజర్ లో చూయించినట్లుగా ఒక్కరోజైనా ఖచ్చితంగా ఉండే సినీ దర్శకునిగా సెట్లో మెలగాలనే ఆకాంక్ష ఉందన్నారు.

దర్శకులు అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ... 'సర్వం సిద్దం టీసెర్ తమను బాగా నవ్వించిందనీ, సినిమా కూడా 100 శాతం కామెడీ చిత్రంగా నిర్మించారని తెలిసి సంతోషపడుతున్నానన్నారు. పూర్తి స్థాయి కామెడీ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తారని ఆయన పేర్కొన్నారు.

సినెటేరియా మీడియా వర్క్స్ సీఈవో వెంకట్ బులెమోని మాట్లాడుతూ... 'గత ఏప్రిల్ నేలో ప్రారంభించిన సర్వం సిద్దం సినిమా షూటింగ్ 70 శాతం పూర్తయ్యిందనీ, మిగిలిన ప్యాచ్ వర్క్ ను ఆగస్టు 14 నుంచి చిత్రీకరించనున్నామని తెలిపారు. రానున్న దసరా - దీపావళి పండుగ సీజన్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

సర్వం సిద్దం చిత్ర దర్శకులు అతిమల రాబిన్ నాయుడు మాట్లాడుతూ... 'సినిమా మొత్తం 100 శాతం కామెడీ మార్కుతో రూపొందిస్తున్నామన్నారు. సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడూ నవ్వలేక పొట్టచెక్కలవ్వడం ఖాయమన్నట్లుగా చిత్రం ఉంటుందని తెలిపారు.

ఎన్.సి.సి మార్కెటింగ్ హెడ్ శ్రీవికాస్ మాట్లాడుతూ... సర్వం సిద్దం టైటిల్ చాలా బాగా ఉందనీ, టైటిల్ లోనే విజయం కనిపిస్తోందనీ, ఈ చిత్రం విజయం ఖాయమని అన్నారు.

సింబయోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ సంచాలకులు డా. రవి కుమార్ జైన్ మాట్లాడుతూ... ' సర్వాంగ సుందరంగా హాస్యరస ప్రధానంగా రూపొందించిన టీజర్ చాలా బావుందనీ, టీజర్ చిత్రం పై అంచనాలను బాగా పెంచిందన్నారు. చిత్రం కూడా పూర్తి కామెడీగా రూపొందించి ప్రేక్షకులను అహ్లాదకరమైన హాస్యాన్ని అందించాల్సిందిగా సూచించారు.

టెక్స్ టైల్స్ ప్రెసిడెంట్ అమ్మనబోలు ప్రకాష్ మాట్లాడుతూ... సర్వం సిద్దం చిన్న చిత్రమైనా, భారీ నిర్మాణ విలువలతో నిర్మించడం చాలా బావుందని పేర్కొన్నారు. చిత్రంలో ఉపయోగించిన లొకేషన్లలో భారీతనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందన్నారు.

నటీనటులు: సర్వం శ్రీనివాస్, రవలి, సరిత, మధుశ్రీ, లావణ్య రెడ్డి, పూజ, ఫరీనా, త్రిషాంక్, మందార్, అభిషేక్, సిద్దేశ్వర్, వెంకటేష్, కిరణ్ ఎం, అర్జున్ కె, చరన్, వెంకటేష్, రాం, యశ్వంత్ తదితరులు

More News

'అవ‌తార్' అవ‌కాశాన్ని వ‌దులుకున్న బాలీవుడ్ స్టార్‌

విజువ‌ల్ వండ‌ర్ అవ‌తార్ సినిమా గురించి సినీ ప్రేమికుల‌కు పెద్దగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. అయితే ఈ సినిమాకు టైటిల్‌ను ఇచ్చింది

సెర్బియాలో పోలీసులకు పట్టుబడ్డ నిమ్మగడ్డ.. రంగంలోకి వైసీపీ ఎంపీలు!

ఫార్మా మాట్రిక్స్‌ ఫార్మా సంస్థ అధిపతి, వాన్‌పిక్‌ నిర్మాణ కాంట్రాక్టర్, తెలుగు రాష్ట్రాల ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌‌కు సెర్బియా పోలీసులు షాకిచ్చారు.

కేఫ్ కాఫీ డే అధినేత సిద్దార్థ్ మిస్సింగ్.. అసలు కథ ఇదీ..!!

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు, కేఫ్ కాఫీ డే అధినేత వీజీ సిద్దార్థ్ సోమవారం రాత్రి నుంచి కనిపించకుండా పోయారు.

చిరుతో చిత్రంలో నాలుగోసారి కుదిరేనా?

మెగాస్టార్ చిరంజీవి `సైరా నరసింహారెడ్డి` పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

అల్లు అర్జున్ సోదరిగా మారిన హీరోయిన్...

`మెంట‌ల్ మ‌దిలో..`  చిత్రంతో తెలుగులో మెల్లిగా ప్ర‌స్థానాన్ని ప్రారంభించిన దుబాయ్ భామ నివేతా పేతురాజ్ మెల్లిమెల్లిగా తెలుగులో సినిమాలు చేస్తోంది.