రష్యా అధ్యక్షుడు పుతిన్ రాజీనామా!

రెండు దశాబ్దాల పాటు రష్యాలో పాలన సాగించిన అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన పదవికి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఆయన రాజీనామా చేయాలనే తీసుకున్న నిర్ణయానికి కారణం ఆయనకు వచ్చిన వ్యాధే కారణమని చర్చ నడుస్తోంది. పుతిన్‌కు అరుదైన పార్కిన్సన్స్ వ్యాధి వచ్చిందని ఈ కారణంగానే జనవరిలో ఆయన పదవి నుంచి వైదొలగనున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.

స్థానిక మీడియా ‘ది సన్’ కథనం ప్రకారం.. పుతిన్ మాజీ జిమ్నాస్ట్ లవర్ అలినా కబేవా ఆయనను అధికార బాధ్యతల నుంచి వైదొలగాలని కోరుతున్నట్టు వెల్లడించింది. అలాగే పుతిన్‌కు సంబంధించి ఇటీవల విడుదలైన ఓ వీడియోలో ఆయన తన కాలును పదే పదే కదపడం కనిపించిందని.. నొప్పికి తాళలేకనే ఆయనలా చేశారని నిపుణులు చెప్పారంటూ ది సన్ వెల్లడించింది. ఈ క్రమంలోనే పుతిన్‌కు పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలు ఉన్నాయంటూ మాస్కో పొలిటికల్ సైంటిస్ట్ ప్రొఫెసర్ వాలెరీ సోలోవి చెప్పడం సంచలనంగా మారింది.

వీటన్నింటికి తోడు పుతిన్ తీసుకొచ్చిన కొత్త చట్టం కూడా ఆయన తన పదవికి రాజీనామా చేయబోతున్నారన్న ప్రచారానికి బలాన్ని చేకూర్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం పుతిన్.. శాశ్వతంగా సెనేటర్‌గా ఉంటారు. దీంతో పుతిన్‌కు జీవిత కాలం పాటు దేశం నుంచి అన్ని అధికారిక సదుపాయాలు ఉంటాయి. మరి పుతిన్ అధికారం నుంచి వైదొలుగుతారంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.