Ramya Raghupathi:నరేష్ - పవిత్రా లోకేష్‌లకు షాక్ : 'మళ్లీ పెళ్లి' రిలీజ్‌ను అడ్డుకోండి .. కోర్టుకెక్కిన రమ్య రఘుపతి
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ నటులు నరేష్, పవిత్రా లోకేష్‌లు కలిసి నటిస్తున్న చిత్రం ‘మళ్లీ పెళ్లి’’ . ఈ నెల 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ క్రమంలో చిత్ర యూనిట్‌కు షాక్ తగిలింది. ‘‘మళ్లీ పెళ్లి ’’ సినిమాను ఆపాలంటూ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె కూకట్‌పల్లిలోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ చిత్రంలో తన ప్రతిష్టకు భంగం కలిగించే సన్నివేశాలు వున్నాయని రమ్య తన పిటిషన్లో పేర్కొన్నారు. మరి దీనిపై నరేష్ - పవిత్రలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
సహజీవనం చేస్తున్న నరేష్ - పవిత్రా లోకేష్ :
పవిత్రా లోకేష్- నరేష్‌ల రిలేషన్షిప్ వ్యవహారం టాలీవుడ్ , శాండిల్‌వుడ్‌లను ఈ ఏడాది ఓ కుదుపు కుదిపిన సంగతి తెలిసిందే. నరేష్, పవిత్రా లోకేష్‌ను నాలుగో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. వీటిని ఇద్దరిలో ఎవ్వరూ ఖండించలేదు. కానీ చివరికి అవే నిజమయ్యాయి. ఇద్దరూ పెళ్లి చేసుకోకుండా, కలిసేవుంటున్నారు. ఇదే సమయంలో నరేష్ మూడో భార్య రమ్య రఘపతి వీరిద్దరిని మైసూరులోని ఓ హోటల్ గదిలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడమే కాకుండా, చెప్పుతో కొట్టేందుకు సిద్ధమైంది. అప్పట్లో ఈ వ్యవహారం దుమారం రేపింది. గతంలో సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసే వీరిద్దరూ ఇప్పుడు ఏకంగా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. అదే ‘‘మళ్లీపెళ్లి’’. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్, ఫస్ట్‌లుక్ , పోస్టర్స్ ఈ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. కొద్దిరోజుల కిందట ‘‘మళ్లీపెళ్లి’’ నుంచి ట్రైలర్ రిలీజైంది. నరేష్, పవిత్రల నిజ జీవితంలో జరిగిన ఘటనలను ట్రైలర్లో కళ్లకు కట్టినట్లుగా చూపించారు.
ట్రైలర్లో బోల్డ్ కంటెంట్.. డైలాగ్స్ :
‘‘తెలుగు చిత్ర పరిశ్రమ కన్నడ వైపు చూపు తిప్పిందేంటీ..? అన్న డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. పార్వతి.. మీ ఆయన నిన్ను ఎలా చూసుకుంటాడు అని నరేష్ పవిత్రను అడుగుతాడు. దీనికి పార్వతి క్యారెక్టర్ అవును అని చెబుతుంది. అలా నరేష్, పవిత్ర బంధం, మా ఎన్నికలు, మైసూరులోని ఓ హోటల్లో పవిత్ర- నరేష్‌లను ఆయన మూడో భార్య పట్టుకోవడం, రమ్య రఘుపతి ప్రెస్ మీట్ చూపించారు. నరేష క్యారెక్టర్‌కు వున్న వెయ్యి కోట్ల ఆస్తిపై ఆయన మూడో భార్య కన్నేసినట్లుగా చూపించారు. ‘‘ముసలోడు అని కనికరించి పెళ్లి చేసుకుంటే ’’ అంటూ కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ అక్కడక్కడా పేలాయి. ఇప్పటికే ఆయనకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి.. నీతో రిలేషన్ అంటే అడిగే ప్రశ్న.. ఉంచుకున్నారా అని పవిత్రను డైలాగ్ ఆలోచింపజేస్తోంది. మొత్తంగా ఈ ట్రైలర్ ద్వారా నరేష్ , పవిత్రలు తమ నిజ జీవితాన్నే సినిమాగా చూపించబోతున్నారని తెలుస్తోంది. దీని ద్వారా మరిన్ని కాంట్రవర్సీలు వస్తాయో లేక, అందరి డౌట్స్‌ని క్లియర్ చేస్తారో తెలియాలంటే మే 26 వరకు వెయిట్ చేయాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments