నువ్వు గెలిచావ్ ‘‘మచ్చా’’.. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 విజేత వీజే సన్నీ
Send us your feedback to audioarticles@vaarta.com
105 రోజుల పాటు తెలుగు ప్రజలను ఉర్రూతలూగించిన బిగ్‌బాస్ 5వ సీజన్‌కు శుభం కార్డు పడింది. ఇన్ని రోజుల నుంచి ఎవరు విజేత ఎవరోనంటూ జరిగిన చర్చకు తెరపడుతూ వీజే సన్నీ ఈ సీజన్ టైటిల్ ఎగరేసుకుపోయాడు. గ్రాండ్ ఫినాలే సందర్భంగా మానస్, శ్రీరామ్, సిరిలు ఎలిమినేట్ అవ్వడంతో సన్నీ- షన్నూల మధ్య విజేత ఎవరోనన్న ఉత్కంఠ ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టింది. టెన్షన్‌ని రెట్టింపు చేసేలా బిగ్‌బాస్ ఒక ఫేక్ గేమ్ ఆడారు.
ప్రతి సీజన్‌లో విజేత ఎవరో వేదికపై తెలుస్తుంది. ఈ సీజన్ లో మాత్రం హౌస్‌లోనే తెలియబోతోంది అని నాగార్జున ప్రకటించారు. అయినప్పటికీ విషయాన్ని నాన్చుతూ.. జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లాన్ని హౌస్ లోకి పంపారు. సన్నీ- షన్నూ ఇద్దరూ చెరో బాక్స్‌లో చేయి పెట్టారు. గ్రీన్ కలర్ ఎవరికి వస్తే వారు విజేత అని నాగ్ ప్రకటించారు. కానీ ఇద్దరి చేతికి బ్లూ కలర్ వచ్చింది. దీంతో ఇది ఫేక్ గేమ్ అని నాగార్జున మరోసారి టెన్షన్ పెట్టారు.
అయితే ఈసారి నాగార్జున స్వయంగా హౌస్ లోకి వచ్చి ఇద్దరినీ వేదికపైకి తీసుకపైకి పట్టుకెళ్లారు. అత్యంత ఉత్కంఠ నడుమ సన్నీ చేతిని పైకెత్తి విజేతగా ప్రకటించారు నాగ్. ఆ మాటతో ఆనందం పట్టలేకపోయిన సన్నీ.. బిగ్గరగా అరుస్తూ నాగార్జునను అమాంతం పైకేత్తేశాడు. టిక్‌టాక్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ రన్నరప్‌గా నిలిచాడు. ఇక విజేత అయిన సన్నీకి రూ.50 లక్షల ప్రైజ్ మనీతో పాటు సువర్ణ భూమి వాళ్లు అందించే రూ.25 లక్షల విలువైన 300 గజాల ఫ్లాట్, టీవీఎస్ అపాచీ బైక్ సొంతం చేసుకున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com