Naa Friendhemo Pelli:జయతి ప్రధాన పాత్రలో ‘నా ఫ్రెండ్‌దేమో పెళ్లి..’ మ్యూజిక్ వీడియో సాంగ్ రిలీజ్
Send us your feedback to audioarticles@vaarta.com
భీమ్స్ సిసిరోలియో సంగీత సారథ్యంలో కాసర్ల శ్యామ్, శ్రావణ భార్గవి కాంబోలో ఆకట్టుకుంటోన్న తెలంగాణ జానపద గీతం అందరితో శభాష్ అనిపించేలా తెలుగు ఒరిజినల్ మ్యూజిక్ వీడియో సాంగ్స్‌ను ఆడియెన్స్‌కు అందిస్తోన్న సంస్థ నివృతి వైబ్స్. అత్యుత్తమమైన ప్రొడక్షన్ వేల్యూస్‌తో ఆడియో, విజువల్ కంటెంట్‌ను అందించటంలో ఎప్పటికప్పుడు తనకు తానే బెస్ట్ అనిపించుకుంటూ ఈ సంస్థ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. గడిచిన రెండేళ్లలో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో నివృతి సంస్థ 50కి పైగా మ్యూజిక్ వీడియో సాంగ్స్‌ను అందించింది. వీటిలో జరీ జరీ పంచెకట్టి.., గుంగులు, సిలక ముక్కుదానా, జంజీరే, వద్దన్నా గుండెల్లో సేరి వంటి పాటలు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ను రాబట్టుకున్నాయి.
ఇప్పుడు నివృతి వైబ్స్ నుంచి మరో తెలంగాణ జానపద పాట మ్యూజిక్ వీడియోగా మన ముందుకు వచ్చింది. ‘నా ఫ్రెండ్‌దేమో పెళ్లి..’ అంటూ సాగే ఈ పాటలో జయతి ప్రధాన భూమికను పోషించింది. బుల్లి తెరపై వెన్నెల ప్రోగ్రామ్‌తో తిరుగులేని క్రేజ్, ఇమేజ్‌ను దక్కించుకున్న జయతి ఈ సాంగ్‌లో అద్భుతమైన హావ భావాలతో, మూమెంట్స్‌లో కట్టి పడేసింది. ఈ మధ్య కాలంలో విడుదలైన సెన్సేషనల్ పాటలకు సంగీతాన్ని అందిస్తోన్న మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో ‘నా ఫ్రెండ్‌దేమో పెళ్లి...’ సాంగ్ కు సంగీత సారథ్యాన్ని అందించారు. శ్రావణ భార్గవి అద్భుతంగా పాడిన ఈ పాటకు ప్రాణం పోశారు. భాను మాస్టర్ సాంగ్కి సూపర్బ్‌గా కొరియోగ్రఫీ చేశారు.లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ మరోసారి తన పెన్ పవర్ ఎలా ఉంటుందో చూపించారు. జయతి విజన్స్ సమర్పణలో శ్రీకోనేటి ఈ పాటను డైరెక్ట్ చేశారు.
యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ డిజిటల్ మాధ్యమంలో ఒక బిలియన్ వ్యూస్ ఉన్న ఫ్లాట్‌ఫామ్స్ నివృతి వైబ్స్ సొంతం. శేఖర్ మాస్టర్, సుద్దాల అశోక్ తేజ, భీమ్స్ సిసిరోలియో, షణ్ముఖ్ జశ్వంత్, మధు ప్రియ, శ్రావణ భార్గవి, దేత్తడి హారిక, లహరి షారి, మానస్, విష్ణు ప్రియ, అనన్య భట్, రాజ్యలక్ష్మి, హారిక నారాయణ్, సాకేత్ కొమందూరి వంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌తో నివృతి వైబ్స్ వర్క్ చేసింది.
2024 పూర్తయ్యేసరికి 150 పైచిలుకు మ్యూజిక్ వీడియో సాంగ్స్‌ను అందించటానికి సన్నాహాలు చేస్తున్నట్లు నివృతి వైబ్స్ సంస్థ తెలియజేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com