Pawan Kalyan: విశాఖను విడిచి వెళ్లండి.. పవన్‌కు పోలీసుల నోటీసులు , జనవాణి రద్దు
Send us your feedback to audioarticles@vaarta.com
విశాఖ విమానాశ్రయంలో వైసీపీ మంత్రులు రోజా, జోగి రమేశ్, టీడీటీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కాన్వాయ్‌పై జరిగిన దాడితో ఏపీ రాజకీయం వేడెక్కింది. నిన్న సాయంత్రం మొదలైన ఉద్రికత్త పరిస్ధితులు.. ఈ రోజూ కొనసాగుతూనే వున్నాయి. వైసీపీ నేతల మాటల దాడి.. జనసేన నేతల ఎదురుదాడి, అరెస్ట్‌లతో రాజకీయం మొత్తం విశాఖ చుట్టూనే తిరుగుతోంది. నిజానికి పోర్టు కళావాహిని స్టేడియంలో ప్రజల సమస్యలను వినతుల రూపంలో స్వీకరించే ‘‘జనవాణి’’ కార్యక్రమం కోసం పవన్ కల్యాణ్ విశాఖ వచ్చారు. అయితే ఆ లోపే పరిస్ధితులు ఉద్రిక్తంగా మారడం.. నోవాటెల్ నుంచి వేదిక వద్దకు ర్యాలీగా కాకుండా మామూలుగా వెళ్లాలని పవన్‌కు పోలీసులు సూచించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు పోలీసులు పవన్ కల్యాణ్‌కు నోటీసులు ఇచ్చారు. పోలీసులతో చర్చల అనంతరం జనవాణి కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు పవన్ కల్యాణ్ మీడియా ద్వారా తెలిపారు. దీనిని రాష్ట్రంలోని ఎన్నో ప్రాంతాల్లో నిర్వహించామని, కానీ విశాఖలో మాత్రం వైసీపీ నేతలు అడ్డుకోవడం దారుణమన్నారు.
వాళ్లని కూడా 3 పెళ్లిళ్లు చేసుకోమనండి:
ఇకపోతే.. తరచుగా తన మూడు పెళ్లిళ్లను ప్రస్తావిస్తూ వైసీపీ చేస్తున్న విమర్శలకు పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. తనకు కుదరకనే 3 పెళ్లిళ్లు చేసుకున్నానని.. వీటిపై మాట్లాడుతున్న వారిని చూస్తుంటే, తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని వారు అసూయ పడుతున్నట్లుగా కనిపిస్తోందన్నారు. వారిని కూడా విడాకులు ఇచ్చి 3 పెళ్లిళ్లు చేసుకోమనండి అంటూ పవన్ తేల్చిచెప్పారు.
జనవాణి ప్రాంగణం వద్ద ఉద్రిక్తత:
అంతకుముందు పవన్ జనవాణి నిర్వహించే వేదిక వద్ద ఉత్తరాంధ్ర జేఏసీ నేతలు నిరసనకు దిగారు. పవన్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అటు పవన్‌కు మద్ధతుగా జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులు కూడా అక్కడికి భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ పరిస్ధితుల నేపథ్యంలోనే పోలీసులు పవన్‌కు నోటీసులు ఇచ్చారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటల లోగా విశాఖ నగరాన్ని విడిచి వెళ్లిపోవాలని అందులో సూచించారు. నగరలో సెక్షన్ 30 అమల్లో వుందని, అందుచేత ఎలాంటి ప్రదర్శనలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. పవన్‌తో పాటు జనసేన ముఖ్య నేతలకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout