విశాఖ గ్యాస్ లీకేజ్‌పై ఎల్జీ పాలిమర్స్ సుధీర్ఘ వివరణ..

  • IndiaGlitz, [Saturday,May 09 2020]

విశాఖపట్నంలోని ఎల్జీపాలిమర్స్ ఫ్యాక్టరీ వద్ద ఇటీవల జరిగిన గ్యాస్ లీకేజీ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో 12 మంది చెందగా.. వందల మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మరోవైపు.. 24 గంటల్లోనే ప్రభుత్వం బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందజేసింది. అయితే ఇక అంతా ప్రశాంతంగా ఉంది.. పరిస్థితి ఇప్పుడిప్పుడే అదుపులోకి వచ్చిందనుకున్న టైమ్‌లో శనివారం బాధిత గ్రామాల ప్రజలు కంపెనీ ముందు ఆందోళనకు దిగారు. కంపెనీ యాజమాన్యం స్పందించాలని.. తక్షణమే ఈ కంపెనీని ఇక్కడ్నుంచి తరలించాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి. అయితే ఘటన జరిగినప్పట్నుంచి ఇప్పటి వరకూ స్పందించని యాజమాన్యం ఎట్టకేలకు ఓ ప్రకటన రూపంలో స్పందించింది.

ప్రమాదానికి కారణమిదీ..

‘రెండు రోజుల క్రితం జరిగిన ఘటన దురదృష్టకరం. ఈ ప్రమాద బాధితులకు మా సానుభూతిని, క్షమాపణలు తెలియజేస్తున్నాం. మా కంపెనీ ప్రభుత్వం, సంబంధిత అధికారులతో కలిసి ప్రమాదానికి కారణాలపై విచారణ జరుపుతోంది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. ప్రాథమిక విచారణ ప్రకారం స్టైరిన్ మోనోమర్‌ స్టోరేజ్ ట్యాంక్ జీపీపీఎస్‌ దగ్గర వాపర్ లీకేజ్‌తో ప్రమాదం జరిగిందని తేలింది. ప్రస్తుతం కంపెనీలో పరిస్థితి అదుపులో ఉంది. అలాగే మేం ప్లాంట్‌లో స్టైబిలైజింగ్‌పై ఫోకస్ పెట్టాం. పూర్తిస్థాయిలో ఈ ప్రమాద బాధితులకు, ఆ కుటుంబాలకు అండగా ఉంటాం.. వారికి వీలైనంత వరకు మేలు చేస్తాం.. అంతేకాదు వారి బాధ్యతను తీసుకుంటాం. ప్లాంట్‌లో మా సిబ్బంది పగలు, రాత్రి తేడా లేకుండా ప్రభుత్వంతో కలిసి కష్టపడుతోంది. జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి సమర్థవంతమైన సంరక్షణ ప్యాకేజీని అందించడానికి ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాం’ అని కంపెనీ యాజమాన్యం ప్రకటనలో రాసుకొచ్చింది.

అన్ని కుటుంబాలను సంప్రదిస్తాం..

‘ప్రమాద బాధితులు, చనిపోయిన వారి కుటుంబాలకు సాయం చేయడానికి, అండగా ఉంటాం. ఒకవేళ ఏదైనా సమస్యలు వస్తే పరిష్కరించడానికి ఓ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నాం. అన్ని కుటుంబాలను త్వరలోనే సంప్రదిస్తాం. ఈ టీమ్ అస్వస్థతకు గురైనవారికి అవసరమైన వైద్యం, ఇతర సాయం అందించేందుకు పని చేస్తోంది. అలాగే ప్రమాదంలో అస్వస్థతకు గురైనవారికి, బాధితులకు మానసిక స్థైర్యాన్ని నింపుతాం. భవిష్యత్‌లోనూ స్థానికుల్లో భరోసా నింపే కార్యక్రమాలు చేపడతాం. ప్రమాదం తర్వాత అస్వస్థతకు గురైనవారిని ఆస్పత్రులకు తరలించేందుకు సాయం చేసిన అధికారులు, పోలీసులకు ధన్యవాదాలు’ అని ప్రకటనలో ఎల్జీ ప్రైవేట్ కంపెనీ యాజమాన్యం ప్రకటనలో రాసుకొచ్చింది.

More News

ఏపీలో తగ్గని కరోనా ఉధృతి.. 2వేలకు చేరువలో కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఉధృతి ఇప్పట్లో తగ్గేలా లేదు. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయే తప్ప అస్సలు తగ్గట్లేదు. కర్నూలు, విజయవాడ, గుంటూరు జిల్లాల్లో అయితే కేసులు సంఖ్య

కోలీవుడ్‌ నటులకు ఏమైంది.. ఈ వివాదాలేంటి!?

కోలీవుడ్ నటులు వివాదాల్లో మునిగి తేలుతున్నారు. వివాదాలంటే దూరంగా ఉండే నటులు సైతం అదెలా ఉంటుందో చూడాలని ఇలా చేస్తున్నారేమో కానీ ఇటు మీడియాలో..

పాన్ ఇండియా మూవీ ‘83’కి సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలిపిన క‌బీర్‌ఖాన్‌

ఇండియన్ క్రికెట్‌ను గ‌తిని మార్చిన ఏడాది 1983. ఈ ఏడాది భార‌త‌దేశం క్రికెట్ ప్ర‌పంచంలో రారాజుగా అవ‌త‌రించింది. క‌పిల్ డేర్ డెవిల్స్ సాధించిన అపూర్వ విజ‌యంతో చాలా మందికి క్రికెట్

కోలీవుడ్‌కు గ్రీన్ సిగ్నల్.. టాలీవుడ్‌కు ఎప్పుడో..!?

తమిళ చిత్ర సీమకు పళనిస్వామి సర్కార్ శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకునేందుకు

ఎన్టీఆర్‌ పుట్టిన రోజున స్టార్ డైరెక్టర్ సడన్ సర్‌ఫ్రైజ్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం ఇప్పుడు స్టార్ డైరెక్టర్లు సైతం క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు పేరుమోసిన.. హిట్ చిత్రాల దర్శకులతో సినిమాలు చేసిన