Sharmila:షర్మిలతో వివేకా కూతురు సునీత భేటీ.. కాంగ్రెస్‌లో చేరే అవకాశం..!

  • IndiaGlitz, [Monday,January 29 2024]

ఏపీ రాజకీయాల్లో రోజుకొక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాలకే పరిమితమైన షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌గా రాష్ట్ర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. రావడం రావడంతోనే ఆమె సోదరుడు సీఎం జగన్‌ పాలనపై వాడివేడి విమర్శలతో విరుచుకుపడుతున్నారు. రోజుకో జిల్లాలో పర్యటిస్తూ వైయస్ కుటుంబాన్ని జగనే చీల్చారు.. తనను వాడుకుని వదిలేశారు లాంటి వ్యక్తిగత విషయాలతో పాటు వైసీపీ ప్రభుత్వం పాలనపైనా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దీంతో అన్నాచెల్లి మధ్య రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

ఈ క్రమంలోనే దివంగత మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత.. షర్మిలతో భేటీ కావడం సంచలనంగా మారింది. కడప జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు ఇడుపులపాయ వెళ్లిన షర్మిలతో సునీత రెడ్డి సమావేశమయ్యారు. ఇద్దరు కలిసి వైయస్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. కడప జిల్లా వైయస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉంది. అదే జిల్లాలో సోదరుడు సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ఇద్దరు చెల్లెళ్లు భేటీ కావడం రాజకీయ ప్రకంపనలు సృష్టి్స్తున్నాయి. వీరిద్దరు ఏం మాట్లాడకున్నారో దానిపై ఉత్కంఠ నెలకొంది.

కొద్ది రోజుల నుంచి వైయస్ ఫ్యామిలీలోని చాలా అంశాలను షర్మిల ప్రస్తావిస్తూ వస్తున్నారు. కుటుంబ వ్యవహారాలు, కుటుంబం ఎందుకు నిలువునా చీలిపోయింది.. ఇందుకు ఎవరు కారణం.. ఇలా ప్రతి అంశంలో జగన్‌ను సూటిగానే ప్రశ్నిస్తున్నారు. అయితే బాబాయ్ వైఎస్ వివేకానంరెడ్డి హత్య కేసుపై మాత్రం ఇంతవరకు స్పందించలేదు. ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ నిందితుడిగా చేర్చింది. అవినాష్ తండ్రి భాస్కరరెడ్డి నిందితుడిగా అరెస్టై జైలులో ఉన్నారు. ఇక జగన్‌ మీద ఈ కేసులో ఆరోపణలు వస్తున్నాయి. అన్ని విషయాలపై జగన్‌ను ప్రశ్నిస్తున్న షర్మిల.. ఈ అంశంపై మాత్రం మౌనంగా ఉంటున్నారు. ఇలాంటి తరుణంలో షర్మిలతో సునీత భేటీ కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. దీంతో ఇక నుంచి వివేకా హత్య కేసును కూడా షర్మిల ప్రస్తావిస్తారా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి.

ఇదిలా ఉంటే సునీతారెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు షర్మిల సిద్ధమయ్యారని టాక్. ఇందుకు సునీత కూడా ఓకే చెప్పారట. ఒకవేళ ఆమె కానీ హస్తం పార్టీలో చేరితే సునీతను కడప ఎంపీ లేదా పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని భావిస్తున్నారట. వైయస్ వివేకానందర్ రెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డి హస్తం ఉందని ఆమె సీబీఐకి ఫిర్యాదుచేసిన సంగతి తెలిసిందే. అలాగే పలు పిటిషన్లలో సునీత స్వయంగా ఇంప్లీడ్ అయ్యారు. ఇప్పుడు ఆమె కాంగ్రెస్‌లో చేరి కుటుంబసభ్యులపై పోటీ చేయడానికి రెడీ అయ్యారట. ఎలా చూసుకున్నా ఇటు షర్మిల లేదా అటు సునీత ఈ రెండు స్థానాల నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో కడప జిల్లాతో పాటు ఏపీ రాజకీయాలు వేడెక్కాయి.

More News

Venu Father: సీనియర్ నటుడు వేణు ఇంట్లో విషాదం.. ఆయన తండ్రి కన్నుమూత

సీనియర్ నటుడు వేణు తొట్టెంపూడి(Venu Thottempudi) కుటుంబలో విషాదం నెలకొంది. ఆయన తండ్రి ప్రొఫెసర్ తొట్టెంపూడి వెంకటసుబ్బారావు ఇవాళ ఉదయం కన్నుమూశారు.

Galla Jayadev: రాజకీయాలకు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ గుడ్ బై.. ఎందుకంటే..?

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో ఇమడలేకపోతున్నానని ప్రకటించారు.

బీహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా.. NDAలో చేరేందుకు సిద్ధం..

ఊహించిందే జరిగింది. లోక్‌సభ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. అందరూ అనుకున్నట్లుగానే బీహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్‌కు తన రాజీనామా

Telangana Good News:తెలంగాణ ఆడబిడ్డలకు శుభవార్త.. త్వరలోనే నగదుతో పాటు తులం బంగారం..

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను ఒక్కోక్కటిగా అమలుచేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)అడుగులు వేస్తున్నారు.

CM Jagan:అభిమన్యుడిని కాదు అర్జునుడిని.. ఎన్నికల శంఖారావం పూరించిన జగన్..

ఉత్తరాంధ్ర వేదికగా సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరించారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని