పార్టీ మారే విషయమై స్పందించిన వివేక్ వెంకటస్వామి

  • IndiaGlitz, [Monday,December 28 2020]

మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు వివేక్ వెంకటస్వామి త్వరలో పార్టీ మారబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై నేడు ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని కొట్టి పారేశారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారం వెనుక వెనుక సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రోద్బలముందనే కచ్చితమైన సమాచారం తనకు ఉందని తెలిపారు. కేసీఆర్ కుటుంబ పాలనను అంతం చేసేందుకే తాను బీజేపీలో చేరానని వెల్లడించారు. దీనిని దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ద్వారా కొంతమేర సాధించానని వివేక్ వెంకటస్వామి తెలిపారు. కాగా.. తన ఆస్తులపై సీబీఐ విచారణ కోరేందుకు తాను సిద్ధమని.. మీ కుటుంబ ఆస్తులపై విచారణకు మీరు సిద్ధమా? అని కేసీఆర్‌కు సవాల్ విసిరారు.

‘‘గత కొద్దిరోజులుగా నేను పార్టీ మారుతున్నట్లు టీఆర్ఎస్ అనుకూల సోషల్ మీడియాలో టీఆర్ఎస్‌కు చెందిన వ్యక్తులు ప్రచారం చేస్తున్నారు. దీని వెనక కేసీఆర్, కేటీఆర్ ప్రొద్బలం ఉందని నాకు ఖచ్చితమైన సమాచారం ఉంది. కేసీఆర్ కుటుంబ పాలన అంతానికే నేను బీజేపీలో చేరాను. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ద్వారా నా టార్గెట్ ను కొంతమేరకు సాధించాను. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ను మట్టి కరిపించడమే తదుపరి లక్ష్యం. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించినందుకే నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా ఆస్తులపై సీబీఐ విచారణ కోరెందుకు నేను సిధ్దం, మీరు మీ కుటుంబ సభ్యుల ఆస్తులపై విచారణకు మీరు సిద్దమా కేసీఆర్ ?’’ అని వివేక్ వెంకటస్వామి ప్రశ్నించారు.

More News

ఏఆర్ రెహ్మాన్‌కు మాతృవియోగం

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్‌కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లిగారైన కరీమా బేగం నేడు మృతి చెందారు.

భారత్‌లో తొలిసారి అందుబాటులోకి డ్రైవర్‌ రహిత రైలు..

భారత్‌లో తొలిసారి డ్రైవర్‌ రహిత రైలు అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ మెట్రోలో డ్రైవర్ రహిత రైలును ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.

వైఎస్‌పై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు...

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఎవరో ఒకరి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూనో..

యాక్ష‌న్ హీరోను ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ చేస్తున్న మారుతి..!

ఓ సినిమా సెట్స్‌లో ఉండ‌గానే మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డ‌మే కాకుండా.. సినిమా ముగియ‌గానే కొత్త సినిమాను స్టార్ట్ చేస్తున్నాడు

మోదీ గడ్డం వెనుక అసలు కారణం ఇదేనట...

ప్రధాని మోదీ ఇటీవల కొంతకాలంగా తెల్లటి గడ్డంతో మెరిసిపోతున్నారు.