బాలయ్య చిత్రంలో విలన్ గా...

  • IndiaGlitz, [Tuesday,October 03 2017]

బాలీవుడ్ న‌టుడు వివేక్ ఒబెరాయ్, వీలున్న‌ప్పుడ‌ల్లా, ద‌క్షిణాది సినిమాల్లో మెరుస్తుంటారు. ఈ ఉత్త‌రాది హీరో రామ్‌గోపాల్ వ‌ర్మ ర‌క్త‌చ‌రిత్ర‌లో ప‌రిటాల ర‌వీంద్ర పాత్ర‌లో మెప్పించారు. రీసెంట్‌గా విడుద‌లైన అజిత్ వివేగం చిత్రంలో మెయిన్ విల‌న్‌గా కూడా న‌టించారు. ఈయ‌న ఇప్పుడు మ‌రోసారి తెలుగు చిత్రంలో న‌టించ‌బోతున్నాడ‌ని స‌మాచారం. అది కూడా బాల‌కృష్ణ చిత్రంలోన‌ట‌.

నంద‌మూరి బాల‌కృష్ణ‌, కె.ఎస్‌.ర‌వికుమార్ కాంబినేష‌న్‌లో బాల‌య్య 102వ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ విల‌న్‌గా న‌టించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ఫిలిం న‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. మ‌రి నిజా నిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.