ఎండ తగలకుండా ఇంటికే పరిమితమయ్యారా?.. అదీ డేంజరేనట..
Send us your feedback to audioarticles@vaarta.com
విటమిన్ డి లోపం ఉన్న వారికి కూడా కరోనా సోకే అవకాశాలు చాలా ఎక్కువన్న విషయం తెలిసిందే. అయితే కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఉద్యోగస్తులు సైతం వర్క్ ఫ్రం హోం చేస్తూ.. ఇంట్లోనే ఉండిపోతున్నారు. ఇది కూడా ఒకరకంగా చేటు తెస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఎండ తగలకుండా ఏసీల్లో ఉంటూ ఇంటికే పరిమితమైన వారికీ డేంజరేనట.. వీరిలో విటమిన్ డి లోపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. కరోనా సోకిన వారిలో ఎక్కువగా విటమిన్ డి లోపించిన వారేనని.. మృతుల్లో సైతం వారి సంఖ్యే ఎక్కువని నిపుణులు చెబుతున్నారు.
విటమిన్ డి పుష్కలంగా ఉన్నవారికి కరోనా సోకినా పెద్దగా ఇబ్బందేమీ లేదని.. వారు త్వరగా వ్యాధిని జయిస్తారని వైద్యులు చెబుతున్నారు. ఎండ బారిన పడకుండా ఉండే నగర వాసుల్లో 80 శాతం మందికి డి విటమిన్ లోపం ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. విటమిన్ డి ముఖ్యంగా శరీరంలోని కొవ్వు నుంచి తయారవుతుంది. మరోవైపు సుప్రభాత సమయంలో సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు విటమిన్ డిని పుష్కలంగా ఉత్పత్తి చేస్తాయి. కానీ బిజీ లైఫ్లో చాలా మంది ఉదయం వేళ సూర్యకాంతికి ప్రాధాన్యమివ్వట్లేదు. ప్రస్తుతం కరోనాను ఎదుర్కోవాలంటే విటమిన్ డి అత్యవసరం కాబట్టి ఇక నుంచైనా రోజూ ఉదయం శరీరంపై సూర్యకాంతి పడేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments